లండన్: వింబుల్డన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన 31వ సీడ్ బార్బొరా క్రెజికోవా టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో క్రెజికోవా 62, 26, 64 తేడాతో ఇటలీ సంచలనం, ఏడో సీడ్ జాస్‌మిన్ పౌలినిను ఓడించింది. క్రెజికోవా కెరీర్‌లో ఇది రెండో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. గతంలో ఫ్రెంచ్ ఓపెన్‌లో కూడా క్రెజికోవా టైటిల్‌ను గెలుచుకుంది. తొలి సెట్‌లో క్రెజికోవా ఆధిపత్యం చెలాయించింది. తన మార్క్ ఆటతో ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శించింది. తమ మార్క్ షాట్లతో పౌలినిని ఉక్కిరిబిక్కిరి చేసింది. బార్బొరా ధాటికి పౌలిని పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. ఏ దశలోనూ బార్బొరాకు కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయింది. మరోవైపు అద్భుత ఆటతో అలరించిన బార్బొరా ఏమాత్రం ప్రతిఘటన లేకుండానే తొలి సెట్‌ను దక్కించుకుంది. కానీ రెండో సెట్‌లో సీన్ పూర్తిగా మారిపోయింది. ఈసారి పౌలిని ఆధిపత్యం ప్రదర్శించింది. అద్భుత ఆటతో బార్బొరాను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒత్తిడిన సయితం తట్టుకుంటూ ముందుకు దూసుకెళ్లింది. పౌలిని ధాటికి బార్బొరా ఎదురు నిలువలేక పోయింది.
కళ్లు చెదిరే షాట్లతో విరుచుకుపడిన పౌలిని లక్షం దిశగా అడుగులు వేసింది. ఇక పౌలిని ఎదురుదాడికి దిగడంతో బార్బొరా పూర్తిగా చేతులెత్తేసింది. ఇదే క్రమంలో పౌలిని అలవోకగా రెండో సెట్‌ను తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఫలితం కోసం మూడో సెట్ అనివార్యమైంది. అయితే నాలుగో సెట్‌లో పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇటు పౌలిని, అటు బార్బొరా ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో పోరులో ఉత్కంఠ తప్పలేదు. ఎవరి సర్వీస్‌ను వారు కాపాడుకుంటూ ముందుకు సాగారు. ఇద్దరు పట్టు వీడకుండా పోరాడడంతో పోరులో ఉత్కంఠత తప్పలేదు. కానీ కీలక సమయంలో పౌలిని ఒత్తిడికి గురైంది. ఇదే సమయంలో వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో బార్బొరా సఫలమైంది. చివరి వరకు నిలకడైన ఆటను కనబరుస్తూ మూడో సెట్‌తో పాటు మ్యాచ్ గెలిచి వింబుల్డన్ ఛాంపియన్‌గా అవతరించింది. మరోవైపు అద్భుత ఆటతో ఫైనల్ వరకు దూసుకొచ్చిన పౌలిని తుది మెట్టుపై మాత్రం బోల్తా పడింది.