Monday, December 23, 2024

అటామిక్ ఎనర్జీ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా బీఏఆర్‌సి డైరెక్టర్ ఎకె మొహంతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బాభా అటామిక్ రీసెర్చి సెంటర్ (బీఏఆర్‌సి) కు చెందిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, డైరెక్టర్ అజిత్ కుమార్ మొహంతి అటామిక్ ఎనర్జీ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ పదవుల్లో ఇంతవరకు ఉన్న కెఎన్ వ్యాస్ స్థానంలో ఆయన నియామకమయ్యారు. మొహంతి తనకు 66 ఏళ్లు వచ్చేవరకు 2025 అక్టోబర్ 10 వరకు బాధ్యతలు నిర్వహిస్తారని ప్రభుత్వం శనివారం తన ఉత్వర్వులో పేర్కొంది. బిఎఆర్‌సి డైరెక్టర్‌గా 2019 మార్చిలో నియామకమైన మొహంతి 1959లో ఒడిశాలో జన్మించారు.

Also Read: మాటనిలబెట్టుకున్న సిఎం కెసిఆర్.. కృతజ్ఞతలు తెలిపిన మంత్రి హరీష్

బరిపడ ఎంపిసి కాలేజీ నుంచి ఫిజిక్స్ డిగ్రీ ఆనర్స్ 1979లో పూర్తి చేశారు. కటక్ రేవెన్‌షా కాలేజీ నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. బీఏఆర్‌సి ట్రైనింగ్ స్కూల్‌లో 26 వ బ్యాచ్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన తరువాత 1983లో బిఎఆర్‌సి న్యూక్లియర్ ఫిజిక్స్ డివిజన్‌లో చేరారు. ముంబై యూనివర్శిటీ నుంచి డాక్టరేట్ పొందారు. న్యూక్లియర్ ఫిజిక్స్‌లో అనేక విభాగాల్లో ఆయన పనిచేశారు. వివిధ సంస్థల్లో గౌరవ పదవులు పొందారు. ఇండియన్ ఫిజిక్స్ అసోసియేషన్ (ఐపిఎ) ప్రధాన కార్యదర్శిగా, తరువాత అధ్యక్షునిగా సేవలు అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News