Sunday, January 19, 2025

ఐసిసి అధ్యక్షుడిగా మళ్లీ బార్‌క్లే ఎంపిక

- Advertisement -
- Advertisement -

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) చైర్మన్‌గా మళ్లీ గ్రెగ్ బార్‌క్లే ఎంపికయ్యారు. శనివారం జరిగిన ఐసిసి సమావేశంలో గ్రెగ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రెగ్ ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారు. న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ తొలిసారి 2020 నవంబర్‌లో ఐసిసి చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ ఏడాది నవంబర్‌తో ఆయన పదవి కాలం ముగియనుంది. కాగా, శనివారం ఐసిసి చైర్మన్ పదవికి ఎన్నికలు నిర్వహించారు. ఇందులో సభ్యులు గ్రెగ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా జింబాబ్వేకు చెందిన తవెంగ్వా ముకులానీ ఎన్నికల బరిలో నిలిచినా చివరి నిమిషంలో తప్పుకున్నారు. దీంతో గ్రెగ్ ఎంపిక లాంఛనమైంది.

ఇదిలావుండగా భారత క్రికెట్ బోర్డుతో సహా 17 మంది ఐసిసిఐ బోర్డు సభ్యులు గ్రెగ్‌కు మద్దతిచ్చారు. దీంతో ఆయన తిరిగి ఐసిసి చైర్మన్‌గా ఎంపికయ్యారు. ఇదిలావుంటే గ్రెగ్ గతంలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేగాక 2015లో ఐసిసి పురుషుల వరల్డ్‌కప్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు. ఇక తనను రెండోసారి ఎన్నుకున్న సభ్యులకు గ్రెగ్ కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేందుకు శాయశక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Barclay Re-elected as ICC President

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News