లక్నో: హోటల్‌లో కబార్ రుచిగా లేకపోడంతో డబ్బులు అడిగినందుకు వంట మనిషిని కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బరేలీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ప్రేమ్‌నగర్‌లో అంకుర్ సబర్వాల్ అనే వ్యక్తి హోటల్ నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో ఆ హోటల్‌కు వచ్చి కబాబ్ ఆర్డర్ చేశారు. కబాబ్ రుచిగా లేదని హోటల్ యజమాని అంకుర్‌తో గొడవకు దిగారు. వారు బిల్లు చెల్లించకుండా హోటల్ నుంచి కారు వద్దకు వెళ్తుండగా వంట మనిషి నషీర్ అహ్మద్‌కు డబ్బులు అడగమని యజమాని గదమాయించాడు. నషీర్ వెళ్లి డబ్బులు ఇవ్వమని అడగడంతో గొడవ జరిగింది. వెంటనే తుపాకీ తీసి నజీర్ కణతో కాల్చడంతో ఈ ఘటనా స్థలంలోనే అతడు చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: కర్ణాటకలో మతతత్వ పూనకం!