Monday, December 23, 2024

బిబిసి డాక్యుమెంటరీని విమర్శించిన రజ్వీ

- Advertisement -
- Advertisement -

బరేలీ: భారత్‌లో ముస్లింల స్థితిపై బిబిసి కథనాన్ని బరేల్వీ మతాధికారి మౌలానా షాబుద్దీన్ రజ్వీ తీవ్రంగా ఖండించారు. ముస్లింలను భారత్ బాగానే చూసుకుంటోందని, ఎలాంటి సమస్యలేదని ఆయన స్పష్టం చేశారు. “ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ సైతం చేతులు కలిపి పనిచేద్దాం అని ముస్లింలకు హామీ ఇచ్చారు. ఆ ప్రకటనను మేము హర్షిస్తున్నాం. బిబిసి వీలయినంత త్వరగా తన తీరును మార్చుకుంటే మంచిది” అన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీపై బిబిసి డాక్యుమెంటరీ తీసింది. అందులో ఆయనను 2002 గుజరాత్ అల్లర్లప్పుడు ఆయన నాయకత్వాన్ని నిలదీసింది. ఆ డాక్యుమెంటరీని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ‘ప్రచారం’ అంటూ కొట్టిపారేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంలే 2002లో గుజరాత్‌లో మతకల్లోలాలు రేగినప్పుడు ఆ రాష్ట్రానికి నరేంద్ర మోడీయే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ అల్లర్లలో 1000కిపైగా మంది చనిపోయారు. వారిలో చాలా వరకు ముస్లింలే. హిందూ యాత్రికులు ప్రయాణిస్తున్న రైలు బోగీకి నిప్పంటుకోగా 59 మంది చనిపోవడంతో నాడు గోధ్రా హింసాకాండ జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News