Monday, January 13, 2025

బరోడా నయా చరిత్ర

- Advertisement -
- Advertisement -

టి20 క్రికెట్‌లో బరోడా టీమ్ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో భాగంగా గురువారం సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో బరోడా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసి నయా చరిత్ర సృష్టించింది. టి20 ఫార్మాట్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ క్రమంలో జింబాబ్వే పేరిట ఉన్న 344 పరుగుల రికార్డును బరోడా బద్దలు కొట్టింది. ఈ ఏడాది అక్టోబర్‌లో గాంబియాతో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. ఇదే ఇప్పటి వరకు టి20 ఫార్మాట్‌లో అత్యధిక స్కోరుగా ఉండేది.

తాజాగా సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో బరోడా ఈ రికార్డును తిరగరాసింది. బరోడా బ్యాటర్లు విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించారు. చెలరేగి ఆడిన భాను పానియా 51 బంతుల్లోనే 15 సిక్సర్లు, ఐదు ఫోర్లతో అజేయంగా 134 పరుగులు చేశాడు. శివాలిక్ శర్మ 17 బంతుల్లో 55, అభిమన్యు సింగ్ 17 బంతుల్లో 53, సోలాంకి 16 బంతుల్లో 50, పష్వాత్ రావత్ 16 బంతుల్లో 43 పరుగులు చేసి ప్రత్యర్థి టీమ్ బౌలర్లను ఊచకోత కోశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సిక్కిం 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 86 పరుగులే చేసింది. ఈ మ్యాచ్‌లో బరోడా 263 పరుగుల తేడాతో సిక్కింను చిత్తు చేసింది. టి20 ఫార్మాట్‌లో పరుగుల పరంగా ఇది నాలుగో అతి పెద్ద విజయం కావడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News