- Advertisement -
నాగర్ కర్నూల్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన శిరీష అలియాస్ బర్రెలక్క ఇప్పుడు నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయబోతున్నది. అందుకామె తన నామినేషన్ దాఖలు చేసింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి నాగర్ కర్నూల్ సమీకృత జిల్లా కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేసింది. ఇదివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి 5754 సీట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. కాగా ఇప్పుడు లోక్ సభ ఎన్నికలకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తోంది. ఇటీవల ఆమె తన బంధువు వెంకటేష్ ను పెళ్లాడింది.
- Advertisement -