- Advertisement -
కొల్లాపూర్ నియోజకవర్గంనుంచి ఇండిపెండెంట్ గా పోటీ దిగిన బర్రెలక్కకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులను సైతం టెన్షన్ కు గురి చేసిన బర్రెలక్క విజయం ఖాయమని పలువురు విశ్లేషించారు కూడా. అయితే ఆమెకు దక్కిన ఓట్లు 5,754 మాత్రమే. అయినా ఎన్నికల్లో ఆమె తనదైన ముద్ర వేసిందని చెప్పక తప్పదు.
వరంగల్ తూర్పు నియోజకవర్గంనుంచి బరిలోకి దిగిన ట్రాన్స్ జెండర్ పుష్పిత లయ కూడా అందరినీ ఆకట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో పోటీచేసిన ఒకే ఒక్క ట్రాన్స్ జెండర్ లయ కావడం విశేషం. అయితే ఆమెకు 17 రౌండ్లలో కలిపి 966 ఓట్లు మాత్రమే దక్కాయి. ఈ నియోజకవర్గంనుంచి కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ గెలిచారు.
- Advertisement -