Tuesday, December 3, 2024

పెళ్లి చేసుకోబోతున్న బర్రెలక్క

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో బర్రెలక్క పేరు వైరల్‌గా మారింది. బర్రెలక్క అసలు పేరు కర్నె శిరీష్, తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో ఆమె వెల్లడించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆమె కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 5754 ఓట్లతో ఆమె నాలుగో స్థానంలో ఉండిపోయారు. 2022 డిసెంబర్‌లో ఆమె బర్రెలకు కాపారిగా ఉంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఉద్యోగాలు రావడం లేదని, అందుకే బర్రెలు కాస్తూ జీవనం సాగిస్తున్నానని చెప్పుకొచ్చారు. దీంతో వీడియో వైరల్ కావడంతో ఆమె పేరు బర్రెలక్కగా ముద్రపడిపోయింది. అప్పటి నుంచి రీల్ చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీగా మారిపోయింది. గతంలో ఆమె వివాహం గురించి వార్తలు రావడంతో స్పందించారు. ఇటీవల బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు రావడంతో ఆమె ఖండించారు. ప్రశాంత్ తనకు అన్నయ్య లాంటి వాడు అని చెప్పడంలో నెటిజన్ల నోళ్లకు తాళం పడింది. తన పెళ్లి గురించి ఆమె ఆధికారికంగా వెల్లడించడంతో నిశ్చితార్థం జరిగినట్లు వీడియోలో పేర్కొంది. తన ఎంగేజ్‌మెంట్ సడెన్ సెట్ కావడంతో ఎవరినీ పిలువలేకపోయానని వివరణ ఇచ్చింది. తన భర్త గురించి వివరాలను బయట పెట్టలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News