Saturday, November 2, 2024

బారికేడ్లు ఎత్తేస్తున్నారు

- Advertisement -
- Advertisement -
Barricades being removed at Ghazipur
ఢిల్లీ శివార్లలో పోలీసు చర్య

న్యూఢిల్లీ : ఢిల్లీ శివార్లలో యుపి సరిహద్దుల వెంబడి ఉన్న బారికేడ్లను తొలిగించే పనిని స్థానిక పోలీసులు శుక్రవారం చేపట్టారు. ఏడాది తరువాత ఈ ప్రక్రియ ఆరంభం అయింది. ఇప్పుడు వీటిని తొలిగిస్తున్నట్లు ఢిల్లీ తూర్పు ప్రాంత డిసిపి ప్రియాంక కాశ్యప్ తెలిపారు. ఎన్‌హెచ్ 9పై బారికేడ్ల తొలిగింపును చేపట్టామని, అయితే వాహనాల రాకపోకలు సక్రమం చేసేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే 24వ నెంబరు జాతీయ రహదారి మీదుగా వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. రైతు నేతలు, ఢిల్లీ పోలీసుల మధ్య రోడ్ల దిగ్బంధ అంశం పరస్పర విరుద్ధ అంశాలతో వివాదాస్పదం అయింది. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు బారికేడ్లను తొలిగిస్తున్నట్లు డిసిపి వెల్లడించారు. దీనితో ప్రయాణికులకు ఇంతకాలపు అసౌకర్యం తొలిగిపోతుందన్నారు. ఢిల్లీ ఉత్తరప్రదేశ్ సరిహద్దులలోని ఘాజీపూర్ వద్ద రైతులు చాలా కాలంగా తిష్టవేసుకుని ఉన్నారు. ఇక్కడ రైతుల దిగ్బంధానికి ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన రీతిలో అడ్డుకట్టలు వేశారు. ముళ్ల కంచెలను అమర్చారు. బహుళ స్థాయి పొరల ఇనుప సిమెంటు దిమ్మెలు, కనీసం ఐదు దళసరి పొరలతో కూడిన ఇనుప కంచెలు వెలిశాయి.

ఇక సాగుచట్టాలను ఎత్తేస్తారుః రాహుల్

ఇప్పుడు రైతుల నిరసన స్థలాల వద్ద ఆటంకాలు తొలిగించారు. ఇక మూడు కొత్త వ్యవసాయ చట్టాలను కూడా త్వరలోనే ఎత్తివేస్తారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఘాజీపూర్ వద్ద ఢిల్లీ పోలీసులు వరుసగా బారికేడ్లు ఎత్తివేస్తున్నారు. ఈ పరిణామంపై రాహుల్ శుక్రవారం స్పందించారు. ఇది కీలక అంశం అని తెలిపారు. ఇప్పటికైతే ఈ కృత్రిమ అడ్డంకుల తొలిగింపు జరిగింది. రైతుల నిరసనల వెల్లువకు జడుసుకుని ఇక కేంద్రం సాగుచట్టాలను ఎత్తివేసితీరుతుందని , అన్నదాత సత్యాగ్రహానికి జిందాబాద్ అని ఆయన భావోద్వేగపు ట్వీటు వెలువరించారు. ఈ హిందీ ట్వీటుకు రైతుల ఉద్యమపు ఫోటోను జతపర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News