Wednesday, January 22, 2025

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి మిస్సింగ్..

- Advertisement -
- Advertisement -

నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. బాసర ట్రిపుల్ ఐటీలో మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం నర్సంపల్లికి చెందిన బన్ని అనే విద్యార్థి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అక్కడే హాస్టల్ ఉంటున్న బన్నీ మూడు రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. అతని ఫోన్ కూడా స్విఛాఫ్ చేసి ఉంది. విషయం తెలిసిన తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. మూడు రోజులుగా బన్నీ ఫోన్ చేయకపోవడం.. తాము ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుండడంతో కంగారు పడిన తల్లిదండ్రులు ఆదివారం హాస్టల్ కు వచ్చి ఆరాతీశారు.

కాగా, బన్నీ ఇంటికి వెడుతున్నానని చెప్పి మూడు రోజుల క్రితమే హాస్టల్ నుంచి వెళ్లినట్టుగా యాజమాన్యం తెలిపింది. దీంతో షాక్ అయిన తల్లిదండ్రులు.. తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా పంపుతారని యాజమాన్యాన్ని నిలదీసింది. బన్నీ ఎక్కడికి వెళ్లాడో తెలియకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ రావడం, ఇంటికి వెడుతున్నాని చెప్పి బయల్దేరడంతో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News