Saturday, November 23, 2024

బాస‌ర‌ ఆల‌య పునః నిర్మాణానికి శ్రీకారం

- Advertisement -
- Advertisement -

భూమిపూజ‌లో పాల్గొన్న‌ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి

 

నిర్మల్: బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులకు అంకురార్పణ జ‌రిగింది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి, అమ్మ‌వారి ఆల‌య పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సరస్వతి అమ్మవారి గర్భాలయ పునఃనిర్మాణంతో పాటు ఇత‌ర అభివృద్ధి ప‌నులకు ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డితో క‌లిసి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి శుక్ర‌వారం భూమి పూజ చేశారు.

ఆలయ పునర్నిర్మాణానికి సిఎం కెసిఆర్ రూ.50 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇప్పటికే రూ.8కోట్ల వ్యయంతో ఆలయ పరిసరాల్లో విశ్రాంతి భవనాలు, తదితర పనులు చేప‌ట్ట‌గా, రూ.22 కోట్లతో ప్రస్తుతం ఉన్న గర్భాలయాన్ని కృష్ణశిలలతో అత్యద్భుతంగా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ కార్యక్ర‌మంలో క‌లెక్ట‌ర్ వ‌రుణ్ రెడ్డి, ఆల‌య కార్య‌నిర్వ‌హ‌ణాధికారి విజ‌యరామారావు, ఇత‌ర అధికారులు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Basara saraswathi temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News