Monday, December 23, 2024

బాసర ఆలయ అర్జిత సేవా ధరల పెంపు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ బాసర : బాసర సరస్వతి అమ్మవారి సన్నిధిలో అర్జిత సేవా ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆదివారం నుంచి ఈ ధరలు అమలులోకి రానున్నాయని ఆలయ ఈవో విజయ రామరావు ఒక ప్రకటనలో తెలిపారు. అమ్మవారి అభిషేకం గతంలో 200 ఉంటే ఇప్పుడు రూ 500 లు, అక్షరాభ్యాసము గతంలో రూ. 100 ఉంటే ఇప్పుడు రూ 150, ప్రత్యేక కుంకుమార్చన గతంలో 150 ఉంటే ఇప్పుడు 200, శ్రీ సత్యనారాయణ పూజ గతంలో రూ. 100 ఉంటే ఇప్పుడు 400 నిత్య చండీ హోహం గతంలో 1116 ఉంటే ఇప్పుడు రూ. 1500 లు. అన్నప్రాసన గతంలో రూ. 100 ఉంటే ఇప్పుడు 150 ఉత్తర్వులు జారీ చేశారు. భక్తులు గమనించాలని ఆలయ అధికారులకు సహకరించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News