Monday, December 23, 2024

మెజార్టీ మార్కు చేరుకోవడంలో విఫలమయ్యాం: బసవరాజ్ బొమ్మె

- Advertisement -
- Advertisement -

కర్నాటక: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ మార్కు చేరుకోవడంలో విఫలమయ్యామని బసవరాజ్ బొమ్మె తెలిపారు. ఫలితాలు వచ్చాక సమగ్రంగా విశ్లేషించుకుంటామని బొమ్మె వెల్లడించారు. వివిధ స్థాయిల్లో లోటుపాట్లు, తదితర అంశాలపై విశ్లేషిస్తామని ఆయన పేర్కొన్నారు. లోటుపాట్లు అధిగమించి ముందుకు సాగుతామని తెలిపారు. షిగ్గావ్ స్థానంలో బసవరాజ్ బొమ్మె (బిజెపి) విజయం సాధించారు. ప్రస్తుతం కర్నాటక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 224 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్(96), బిజెపి(44), జెడిఎస్(13), ఇతరులు(04) స్థానాల్లో విజయం సాధించారు. అటు అధిక్యంలో చూసుకుంటే బిజెపి(23), కాంగ్రెస్ (36), జెడిఎస్ (8), ఇతరులు (0), గా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News