- Advertisement -
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మై ప్రమాణ స్వీకారం చేశారు. 20వ ముఖ్యమంత్రిగా బుధవారం ఉదయం 11 గంటలకు బసవరాజు చేత గవర్నర్ తాహర్ చాంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. బసవరాజు కూడా లింగాయత్ వర్గానికి చెందినవారే. లింగాయత్ ఓట్లే బిజెపిని అధికారంలోకి తీసుకొచ్చాయి. 1998 నుంచి 2008 వరకు ఎంఎల్‌సిగా రెండు సార్లు గెలిచారు. 2008లో జెడిఎస్ నుంచి బిజెపిలో చేరారు. షిగ్గోన్ నియోజకవర్గం నుంచి ఎంఎల్‌ఎ గెలుపొందారు. 2008 నుంచి 2013 వరకు నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారు. లింగాయత్ వర్గానికి చెందిన వ్యక్తి కావడమే కాకుండా యెడియూరప్పకు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన వైపు బిజెపి అధిష్టానం మొగ్గుచూపింది. ఉత్తర కర్నాటకలోని షిగ్గాన్ నియోజకవర్గంనుంచి మూడు సార్లు ఎంఎల్‌ఎగా ఎన్నికయ్యారు. యెడ్యూరప్ప మంత్రివర్గంలో హోంమంత్రిగా పని చేసిన అనుభవం ఉంది.
- Advertisement -