Wednesday, January 22, 2025

బసవతారకం ఆస్పత్రి లక్షలాది మందికి సేవలందిస్తోంది: రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బసవతారకం ఆస్పత్రి లక్షలాది మందికి సేవలందిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. బసవతారకం ఆస్పత్రిని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారని కొనియాడారు. పేదలకు సేవలందించాలని 1988లో ఆలోచన వచ్చిందని, నిస్వార్థంగా పేదలకు సేవలందించేందుకు ఆస్పత్రిని నిర్మించారన్నారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి 24వ వార్షికోత్సవం కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మేనేజింగ్ ట్రస్టీ, ఎపి టిడిపి ఎంఎల్‌ఎ బాలకృష్ణ, ఎంపి భరత్ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. శంషాబాద్ లో హెల్త్ టూరిజం హబ్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాన్నారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అభివృద్ధిలో పోటీపడే అవకాశం తనకు వచ్చిందని, చంద్రబాబు 18 గంటలు పని చేసి తాను 12 గంటల పని చేస్తే సరిపోదని, రాష్ట్ర నేతలు, అధికారులు కూడా 18 గంటలు పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు పోటీపడడంతో పాటు ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News