Saturday, November 23, 2024

బసవేశ్వర జయంతి వేడుకల్లో హరీశ్ రావు..

- Advertisement -
- Advertisement -

Basaveshwara Jayanti Celebrations in Siddipet

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పొన్నాల వద్ద ఏర్పాటు చేసిన బసవేశ్వర జయంతి వేడుకల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ”హైందవ మతాన్ని సంస్క‌రించిన‌ ప్రముఖులలో ఒకడు. ఈతడిని బసవన్న, బసవుడు అని, విశ్వగురు అని పిలుస్తారు. సమాజంలో కుల వ్వవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది. లింగాయత ధర్మం స్థాపించారు. సిద్ధిపేట వచ్చే ప్రతి ఒక్కరూ బసవేశ్వరుడి ఆశీస్సులతో సిద్ధిపేటకు వస్తాం. ఈరోజు బసవేశ్వరుని 889 జయంతిని జరుపుకుంటున్నాం. 12వ శతాబ్దంలో కుల రహిత సమాజం కోసం కృషి చేశారని, చెప్పడంతో పాటు ఆచరణలో అమలు చేసిన వ్యక్తి. ప్రతి ఒక్కరూ కష్టపడి చేయాలని, కష్టపడి పని చేసిన వారే జీవితంలో పెకొస్తారని చెప్పిన ఆయన సూక్తులను స్ఫూర్తిగా తీసుకుని పని చేద్దాం. హైదరాబాదు ట్యాంకు బండ్ మీద మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపి బసవేశ్వరుడి విగ్రహ ఏర్పాటు చేయించారు. ఇందుకు రూ.66లక్షలతో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అధికారికంగా విగ్రహం ఏర్పాటు చేయించాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బసవేశ్వర జయంతిని అధికారికంగా నిర్వహిస్తుంది. హైదరాబాదులో కోకాపేటలోని ఎకరా స్థలం(20, 30 కోట్ల విలువ కలిగిన) భూమిని ఇవ్వడంతో పాటుగా రూ.10కోట్ల రూపాయలతో భవన నిర్మాణం చేయబోతున్నాం. అన్ని రకాలుగా సమాజ గౌరవం నిలబెట్టడానికి బసవేశ్వరుడి మార్గంలో పయనించి అందరూ పాటు పడాలని కోరారు. ఇటువలే బసవేశ్వర స్వామి పేరు మీద బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ గా కొత్త ప్రాజెక్టు కట్టబోతున్నాం” అని పేర్కొన్నారు.

Basaveshwara Jayanti Celebrations in Siddipet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News