Sunday, January 12, 2025

సిరియా అధ్యక్షుడు బషర్ కు రష్యా రాజకీయ ఆశ్రయం

- Advertisement -
- Advertisement -

మాస్కో: సిరియా నుంచి పారిపోయిన  అధ్యక్షుడు బషర్ రష్యాలో రాజకీయ ఆశ్రయం పొందుతున్నారు. బషర్ అల్ అసద్ భారత్ కు చాలా నమ్మకమైన మిత్రుడు. ప్రత్యేకించి భారత్ తో పలు వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు. నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కాలం(1957) నుంచి నేటి వరకు భారత్, సిరియా సంబంధాలు సాఫీగా సాగాయి. కశ్మీర్ అంశంలో కూడా అసద్ భారత్ వైపే నిలబడ్డారు. ఐక్యరాజ్య సమితిలో కూడా భారత్ కు మద్దతుగానే సిరియా గళం విప్పింది.

సిరియాలో భారత్ కు చెందిన ఓఎన్ జిసి చమురు వెలికితీత ఒప్పందం కుదుర్చుకుంది. విద్యా, వ్యవసాయం, ఐటి…తదితర రంగాల్లో భారత్ పెట్టుబడులు పెట్టడమేకాక, సిరియాకు ఆర్థిక సాయం కూడా అందిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు సిరియాలో తిరుగుబాటు రావడానికి కారణం టర్కీ.  పరిస్థితులు మారినందున భారత్ ప్రయోజనాలు సిరియాలో ఎలా ఉంటాయనేది ఇప్పుడే చెప్పడం సాధ్యం కాదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News