భూపాలపల్లి : డబుల్‌బెడ్రూంలో మౌలిక వసతులను పూర్తి చేసి లబ్ధ్ద్దిదారులకు ఈ నెలాఖరులోగా ఇండ్లను అందించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. భూపాలపల్లిలో గల వెలిశాలపల్లిలో అర్హులైన లబ్ధిదారులకు అందజేసిన డబుల్‌బెడ్రూం ఇళ్లకు మౌలిక వసతులు కల్పనకు అవసరమైన నీటి సరఫరా, విద్యుత్ సరఫరా కోసం పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, మున్సిపాలిటీ అధికారులతో కలిసి కలెక్టర్ సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డబుల్‌బెడ్రూం లబ్ధిదారులకు నీటి సరఫరా కోసం ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంక్‌లను నిర్మించి అవసరమైన సామర్థాన్ని బట్టి మిషన్ భగీరథ పైప్‌లైన్ ద్వారా ఇళ్లకు నీటి సరఫరా అంది ంచాలని, వీటికి అయ్యే ఖర్చు అంచనా వేసి వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా అన్ని బ్లాక్‌లలో పెయింటింగ్ పూర్తి చేసి విద్యుత్ సరఫరా అందించేలా చూడాలని, అలాగే లబ్ధ్దిదారులకు విద్యుత్ కనెక్షన్ కోసం లబ్ధ్దిదారులు మీటర్లు బిగించుకొని విద్యుత్‌ను వాడుకోవాలని అన్నారు. ఈ పనులన్ని త్వరితగతిన పూర్తి చేసి ఆగష్టు నెలాఖరు కల్లా లబ్ధ్దిదారులందరికి ఇళ్లను అప్పగించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ దివాకర, మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్ అనిల్‌కుమార్, పిఆర్ డిఈ వెంకటేశ్వర్లు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.