మన తెలంగాణ/ బాసర: బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. శనివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎ మ్మెల్యే విఠల్ రెడ్డి, కలెక్టర్ ముషారప్ అలీ ఫారుఖిలు విద్యార్థులతో చ ర్చలు జరిపినా ఫలితం లేకుండాపోయింది. విద్యార్థులు పట్టువీడకుం డా ఆదివారం కూడా నిరసనలు చేపట్టారు. విద్యార్థులు ప్రతిపాదించిన డిమాండ్లపై స్పందన లేకపోవడంతో ఆరో రోజు విద్యార్థులు నిరసనల్లో పాల్గొన్నారు. ఐఐటీ ప్రధాన ద్వారం వద్ద దాదాపు ఐదు వేల మంది వి ద్యార్థులు బైఠాయించి నిరసన తెలిపారు. మెయిన్ గేటు వద్దకు ఎవర్నీ వెళ్లనీయకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యమంత్రి నుంచి హమీ వచ్చేవరకు ఆందోళన ఆగదని విద్యార్థులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తే తప్ప ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు.
మరో వైపు యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం స్వచ్ఛందంగా ఇంటికి వెళ్లే విద్యార్థులకు అనధికారికంగా అనుమతిస్తోంది. 12డిమాండ్లతో ఈనెల 14 నుంచి వి ద్యార్థులు ఆందోళన బాట పట్టారు. బాసర ఐటీకీ 2కిలోమీటర్ల దూరం లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు మద్దతుగా ఇవాళ సాయ త్రం నిజామాబాద్ నుంచి ఎబిబిపి కార్యకర్తలు బాసర చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో ఎబివిపి కార్యకర్తలను అదుపులోకి తీసుకుని బాసర పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అదేవిధంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ (టిజివిపి) తరఫున ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు పల్లపు తులసిరాం మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సిఎం స్పష్టమైన ప్రకటన చేయాలని అన్నారు.