- Advertisement -
హైదరాబాద్: హైదరాబాద్ పరిధిలో 350, హైద్రాబాద్ బయట పట్టణాల్లో 150 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజల సుస్తీ పోగొట్టేందుకు గాను, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 500 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 363 బస్తీ దవాఖానలు సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. మరో 57 బస్తీ దవాఖానలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, వాటిని వెంటనే ప్రారంభించాలి అధికారులను ఆదేశించారు.
తుది దశలో ఉన్న మిగతా దవాఖానల పనులు వేగవంతం చేయాలని, జూన్ నెలాఖరు వరకు 500 బస్తీ దవాఖానలు పూర్తి స్థాయిలో పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల సౌకర్యార్థం ఆదివారం కూడా సేవలు అందిస్తున్నామని, అందరికీ తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు సేవలు అందించాలని సూచించారు.
- Advertisement -