Thursday, January 9, 2025

నెలలో టిహెచ్‌ఆర్ నగర్‌కు బస్తీ దవాఖాన

- Advertisement -
- Advertisement -
  • టిహెచ్‌ఆర్ నగర్ శరవేగంగా అభివృద్ధి
  • అమ్మవారి దయతో ప్రజలంతా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవార్లను దర్శించుకున్న మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట : పట్టణంలోని టిహెచ్‌ఆర్ నగర్‌లోని ప్రాంత వాసుల కోసం నెల రోజులలో బస్తీ దవాఖాన ప్రారంభిస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆషాడ మాసం పురస్కరించుకొని పట్టణ టిహెచ్‌ఆర్ నగర్‌లోని ముత్యాల పోచమ్మ ఆలయంలో ఐదవ వార్షికోత్సవ వేడుకలు, బోనాల జాతర పండుగ హాజరై అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు కాలనీకి రేషన్ కార్డు కావాలని ప్రాంత వాసులు కోరిక మేరకు వెంటనే ఏర్పాటు చేయిస్తానని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలనీ వాసులకు ఆలయ ఐదవ వార్షకోత్సవ భోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. టిహెచ్‌ఆర్ నగర్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.

పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాంతంలో రోడ్లు , మురికి కాల్వలకు దశల వారిగా నిధులు విడుదల చేయిస్తామని హామీ ఇచ్చారు. అమ్మదయతో ప్రజలంతా సుభిక్షంగా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అంతకు ముందు పట్టణంలోని సుభాష్ నగర్‌లోని పోచమ్మ ఆలయానికి ఆ ప్రాంత కాలనీ వాసులు పెద్దఎత్తున తరలివచ్చి వైలలు తీయుట, బియ్యం సుంకు పట్టుట, బోనాలు తీయుట, గావు పట్టుట కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు కుటుంబ సమేతంగా అమ్మవారికి బోనాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News