తుర్కయంజాల్: బస్తీ దవాఖానాలు మున్సిపాలిటీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సూచించారు. మంగళవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ మునుగనూర్ 15వ వార్డు కౌ న్సిలర్ వేముల స్వాతి అమరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో వార్డులో బస్త్తీ దవాఖానాను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, పురపాలిక చైర్‌పర్సన్ మల్‌రెడ్డి అనురాధ రాంరెడ్డిలు ముఖ్యఅతిధులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం ఇవ్వాలనే నిర్ణయంతో వారి వద్దే వైద్యం అందించాలనే ఉద్దేశంతో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయన్నట్లు పేర్కొన్నారు.
పురపాలిక ప్రజలు బస్తీ దవాఖానాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిసిసిబీ వైస్ ఛైర్మన్ కొత్తకుర్మా సత్తయ్య, పురపాలిక వైస్ ఛైర్మన్ గుండ్లపల్లి హరిత ధన్‌రాజ్‌గౌడ్, జిల్లా రైతు బందు సమితి అధ్యక్షుడు వంగేటి లకా్ష్మరెడ్డి, కమిషనర్ ఎండి సాబేర్ అలీ, డిఎంఎచ్‌ఓ డాక్టర్ వెంకటేశ్వర్‌రావు, డిప్యూటీ డిఎంహెచ్‌ఓ ఇబ్రహింపట్నం డివిజన్ డా, ధరణికుమార్, కౌన్సిలర్‌లు తాళ్లపల్లి సంగీత మోహన్‌గుప్త, బొక్క రవీందర్‌రెడ్డి, నారాని కవిత శేఖర్‌గౌడ్, కళ్యాణ్‌నాయక్, కోఅప్సన్ సభ్యులు నక్క సువర్ణ రాజు గౌడ్, బ్యాంకు డైరక్టర్ సామ సంజీవరెడ్డి, నాయకులు కందాడ లకా్ష్మరెడ్డి, కందాడ ముత్యంరెడ్డి, మున్సిపాలిటీ బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్యక్షుడు వేముల అమ రేందర్‌రెడ్డి, బస్తి దవాఖానా ఇంచార్జ్ వినోద్‌కుమార్, పిహెచ్‌సీ డాక్టర్ సాయిలక్ష్మిశ్వేతా, హెల్త్ సూపర్‌వైజర్ నర్సింహ్మ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.