Wednesday, February 26, 2025

క్షమించండి.. కానీ, ఫైనల్ ఆడేది వాళ్లే: పాక్ మాజీ బ్యాటర్

- Advertisement -
- Advertisement -

ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీకి అతిథ్యమిస్తున్న పాకిస్థాన్‌ టోర్నమెంట్‌లో మాత్రం ఊహించినంతగా రాణించలేదు. ఆడిన రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓటమిపాలై.. సెమీస్‌కు వెళ్లకుండా టోర్నమెంట్ నుంచి వైదొలిగింది. దీంతో ఈ మ్యాచ్‌లకు ముందు తమ జట్టుపై నమ్మకంతో చేసిన వ్యాఖ్యలను ఆ దేశ మాజీ క్రికెటర్లు ఒక్కొక్కరిగా వెనక్కి తీసుకుంటున్నారు. తాజాగా ఈ లిస్టు‌లో పాక్ మాజీ బ్యాట్స్‌మెన్ బసిత్ అలీ చేరారు.

ఈ టోర్నమెంట్‌లో పాకిస్థాన్ జట్టు అద్భుతంగా రాణిస్తుందని అలీ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాక.. లాహోర్‌లో ఫైనల్ జరుగుతుదని అందులో పాకిస్థాన్ ఉంటుందని ఆశపడ్డారు. కానీ, అలా జరగలేదు. దీంతో ఆయన అభిమానులకు క్షమాపణ చెప్పారు. ‘టోర్నమెంట్‌లో పాకిస్థాన్ జట్టు టైటిల్‌కి అర్హత సాధిస్తుందని చెప్పినందుకు నన్ను క్షమించండి. పాకిస్థాన్ ఇంత చెత్తగా ఆడుతుందని నేను అనుకోలేదు. ఇక మార్చి 9న జరిగే ఫైనల్‌లో భారత్, సౌతాఫ్రికా తలపడితే బాగుటుంది’ అని ఆయన తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News