Monday, December 23, 2024

హెడ్ కానిస్టేబుల్ అశోక్‌వర్ధన్ కుటుంబానికి బ్యాచ్‌మేట్ల ఆర్థిక సాయం

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో : ఆర్‌జిఐఎ ఎయిర్‌పోర్ట్ పోలీసుస్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ గత జూన్ 21 తేదీన అనారోగ్యం తో మృతి చెందిన పి.అశోక్ వర్ధన్ కుటుంబానికి తోటి 2000 బ్యాచ్ హెడ్ కా నిస్టేబుళ్లు ఆర్ధిక సహాయాన్ని అందించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బ్యాచ్ (సైబరాబాద్, రాచకొండ, నిజామాబాద్) తమ వంతుగా రూ. 2,45,525 చెక్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సమక్షంలో అశోక్ వర్ధన్ భార్య చంద్రకళ, పిల్లలు సుజన్, సంజనలకు అందజేశారు.

శాఖ ప రంగా వీరి కుటుంబానికి అందాల్సిన బెనిఫిట్స్ త్వరగా వచ్చేవిదంగా చర్య లు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు కోరారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు మేమున్నామని భరోసా క ల్పించారు. ఈ కార్యక్రమంలో మృతుడు అశోక్ వర్ధన్ బ్యాచ్ మేట్స్ శ్రీనివా స్, సత్తయ్య, వెంకటేష్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు సి.హెచ్. భ ద్రా రెడ్డి, కోశాధికారి జి.మల్లేశం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. కరుణాకర్ రెడ్డి, జి. క్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News