Friday, November 22, 2024

విభజితమైతే కోసేయబడతారు, ఐక్యంగా ఉంటే బాగుంటారు: యోగి ఆదిత్య నాథ్

- Advertisement -
- Advertisement -

ఆగ్రా: బంగ్లాదేశ్ లో తాజాగా హింసాత్మక ఘటనలు చెలరేగడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ‘‘ జాతిని మించినది ఏది లేదు. ఐక్యంగా ఉన్న జాతే సాధికారతను సాధిస్తుంది. విభజించబడితే కోసేస్తారు. బంగ్లాదేశ్ లో ఏమి జరుగుతోందో మీరు చూస్తున్నారు. అలాంటి తప్పు ఇక్కడ జరగకుండా చూడాలి… బటేంగే తో కటేంగే, ఏక్ రహేంగే తో నేక్ రహేంగే’ అన్నారు. ఆగ్రాలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ పై విధంగా చెప్పారు. బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘటనలపై యూపి ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆగస్టు 5న షేక్ హసీనా దేశం వదిలి పారిపోయాక అక్కడ రాజకీయ సంక్షోభం ఏర్పడిందన్నారు.

బంగ్లాదేశ్ లో నేడు హిందూ జనాభా కేవలం 8 శాతమే. దాంతో హిందువుల మీద దాడులు, హిందువుల మందిరాల కూల్చివేతలు, ఆస్తుల విధ్వంసాలు కొనసాగుతున్నాయన్నారు. షేక్ హసీనా దేశం వదిలిపెట్టాక ఇప్పటి వరకు బంగ్లాదేశ్ లో 200 దాడులు జరిగాయన్నారు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News