Wednesday, January 22, 2025

ఆ నలుగురు జవాన్లను కాల్చింది సైనికుడే..

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: పంజాబ్ లోని అత్యంత కీలకమైన బఠిండా సైనిక స్థావరంలో ఇటీవల చోటు చేసుకున్న కాల్పుల ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో దర్యాప్తు చేపట్టిన పంజాబ్ పోలీసులు సోమవారం ఓ జవానును అరెస్టు చేశారు. ఈమేరకు బఠిండా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుల్నీత్ సింగ్ ఖురానా వెల్లడించారు. ఈ కేసులో తొలుత తమను తప్పుదోవ పట్టించిన సైనికుడే అసలు నిందితుడని, అతడే కాల్పులకు పాల్పడినట్టు ఖురానా తెలిపారు. ఈమేరకు సైనిక స్థావరంలో గన్నర్‌గా విధులు నిర్వహిస్తున్న మోహన్ దేశాయ్ అనే సైనికుడిని ఈ కేసులో అరెస్టు చేసినట్టు వెల్లడించారు. “వ్యక్తిగత కారణాలతోనే నిందితుడు ఈ కాల్పులకు పాల్పడ్డాడు. మృతి చెందిన జవాన్లతో అతడికి (దేశాయ్ మోహన్) వ్యక్తిగత వైరం ఉంది” అని ఎస్‌ఎస్పీ పేర్కొన్నారు.

Also Read: అవినాశ్ రెడ్డి సిబిఐ విచారణలో చిన్న ట్విస్ట్!

ఏప్రిల్ 12వ తేదీ తెల్లవారు జామున బఠిండా సైనికస్థావరంలో చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో సాక్షిగా ఉన్న మేజర్ అషుతోశ్ శుక్లా వాంగ్మూలం ఆధారంగా పంజాబ్ పోలీసులు ఇద్దరు వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆదివారం నలుగురు అనుమానిత జవాన్లను అదుపు లోకి తీసుకుని విచారించారు. ఈ క్రమం లోనే మోహన్ దేశాయ్‌ను విచారించగా, అతడు నేరాన్ని అంగీకరించినట్టు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. వ్యక్తిగత తగాదాల కారణంగానే తన సహోద్యోగులను కాల్చినట్టు మోహన్ విచారణలో అంగీకరించినట్టు సదరు వర్గాలు పేర్కొన్నాయి. మిలిటరీ స్టేషన్ లోని శతఘ్ని విభాగానికి చెందిన బ్యారెక్స్‌లో నలుగురు జవాన్లు నిద్రిస్తుండగా, ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది.

Also Read: ఇది పంజాబ్.. ఇండియా కాదు(వైరల్ వీడియో)

కాగా… కాల్పుల తరువాత బ్యారెక్స్ నుంచి కుర్తాపైజామా ధరించి ముఖానికి మాస్క్‌లు పెట్టుకుని ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చినట్టు చెప్పింది మోహనే. నిందితుల్ల ఒకరి చేతిలో ఇన్సాస్ రైఫిల్, మరొకరి చేతిలో గొడ్డలి ఉండటం తాను చూశానని మోహన్ ఆర్మీ అధికారులకు చెప్పడం గమనార్హం. ఈ కాల్పుల ఘటనలో సాగర్ బన్నె (25), కమలేశ్ ఆర్ (24),సంతోష్ ఎం. నగరాల్ (25) ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరిది కర్ణాటక కాగా, మరో ఇద్దరిది తమిళనాడు, బఠిండా స్థావరం దేశం లోనే అతిపెద్ద సైనిక స్థావరాల్లో ఒకటి. ఇక్కడ 10 వ కోర్ కమాండ్‌కు చెందిన దళాలున్నాయి. జైపూర్ కేంద్రంగా పనిచేసే సౌత్‌వెస్ట్రన్ కమాండ్ ఆధీనంలో ఈ స్థావరం పనిచేస్తోంది. పెద్ద సంఖ్యలో ఆపరేషనల్ ఆర్మీ యూనిట్లు, ఇతర కీలక పరికరాలు ఇక్కడున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News