మహిళలతో కలిసి ఆడిపాడిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు
హుజూరాబాద్‌లో గ్యాస్ ధరలను నిరసిస్తూ బతుకమ్మ ఆడిన మహిళలు
రాజ్‌భవన్‌లో పూల పండుగను ప్రారంభించిన గవర్నర్
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎంగిలిపూల వేడుకతో బ తుకమ్మ పండుగ బుధవారం మొదలయ్యింది. బతుకమ్మ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి ఇంటా సందడి ప్రారంభమైంది. ఎంగిలిపూలతో నేడు ప్రారంభమైన ఈ సంబురం తొ మ్మిదో రోజున సద్దుల బతుకమ్మ ఉత్సవంతో ముగియనుం ది. బుధవారం జరిగిన బతుకమ్మ వేడుకల్లో మంత్రులతో పాటు ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, ప్రజా ప్రతినిధులు ఉ త్సాహాంగా పాల్గొన్నారు. రాజ్‌భవన్‌లో మహిళలతో కలిసి గవర్నర్ తమిళిసై ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భం గా పూల పండుగను గవర్నర్ ప్రారంభించారు. బతుకమ్మ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మహిళలకు శు భాకాంక్షలు తెలిపారు. నేడు తెలుగు యూనివర్శిటీలో బ తుకమ్మ వేడుకల్లో గవర్నర్‌తో పాటు ఎంఎల్‌సి కవిత పాల్గొనన్నుట్టు అధికారులు తెలిపారు.
బిజెపి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ..
హుజూరాబాద్‌లో జరిగిన బతుకమ్మ వేడుకలను స్థానిక మహిళలు వినూత్నంగా నిర్వహించారు. పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా ‘గ్యాస్ ధరలను పెంచారో ఉయ్యాలో… గరీబులను చేశారు ఉయ్యాలో’ అంటూ బిజెపి ప్రభుత్వా న్ని విమర్శిస్తూ బతుకమ్మలను మహిళలు ఆడారు.
ఎంగిలిపూల రోజున నువ్వులు, బియ్యం పిండి
వివిధ రకాల పూలతో భక్తిశ్రద్ధలతో బతుకమ్మలను మహిళ లు అందంగా అలంకరించారు. ఎంగిలిపూల రోజున ను వ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. ఇలా తొమ్మిది రోజులు ఒక్కోరోజు ఒక్కో నైవేద్యా న్ని సమర్పిస్తారు. తొమ్మిది రోజులు జరుపుకునే ఒక్కో రోజుది ఒక్కో ప్రత్యేకత. రోజుకో రకమైన పూలతో రోజుకో ప్రత్యేకమైన నైవేద్యాన్ని గౌరమ్మకు సమర్పిస్తారు.
తొమ్మిది రోజుల బతుకమ్మ తయారీ ఇలా..
ఎంగిలిపూల బతుకమ్మ: మహాలయ అమవాస్య రోజు బతుకమ్మ వేడుక మొదలవుతుంది. రాష్ట్రంలో దీన్ని పెత్ర మాస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చే స్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
ముద్దపప్పు బతుకమ్మ: ముద్ద పప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.
నానే బియ్యం బతుకమ్మ: నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.
అట్ల బతుకమ్మ: అట్లు లేదా దోశ నైవేద్యంగా సమ ర్పిస్తారు.
అలిగిన బతుకమ్మ: ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవే ద్యమేమి సమర్పించరు.
వేపకాయల బతుకమ్మ: బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
వెన్నముద్దల బతుకమ్మ: నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బె ల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
సద్దుల బతుకమ్మ: ఆశ్వయుజ అష్టమినాడు అదే రోజు దుర్గాష్టమి జరుపుకుంటారు. ఐదు రకాల నైవేద్యాలు త యారు చేస్తారు.