Monday, December 23, 2024

తెలంగాణ పూలవెల్లి

- Advertisement -
- Advertisement -

అట్టహాసంగా ప్రారంభమైన బతుకమ్మ
తొలిరోజు ఎంగిలిపూల పండుగ
ఉత్సాహంగా ఆడిపాడిన ఆడపడుచులు

తెలంగాణ పూల సంబురం షురూ అయ్యింది.
తొలి రోజైన ఆదివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా ఆడపడుచులు ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలను అంబరాన్నంటేలా జరుపుకున్నారు. పల్లెలు, పట్టణాల్లో ఎక్కడ చూసిన బతుకమ్మ సందడి కనిపించింది.

రాజ్‌భవన్‌లో వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళి సై
బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న మంత్రులు హరీశ్, నిరంజన్, కొప్పుల

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా బతుక మ్మ సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తె లంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మను తొలిరోజు ఎంగిలిపూలతో కొలిచారు. తంగే డు, గునుగు, చామంతి, పట్టుగుచ్చులు ఇలా తీరొక్క పు వ్వులతో బతుకమ్మలను పేర్చి అలంకరించారు. సాయం త్రం వేళ్లల్లో గ్రామాలు, పట్టణాల్లోని వీధుల్లోకి తీసుకువచ్చి ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఉయ్యాల పాటలు పడుతూ.. చేతులతో చప్పట్లు చరుస్తూ చిన్నా, పెద్దలంతా ఆటలాడారు. పిత్రమాసం తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలలో బతుకమ్మ శోభ ఉట్టిపడింది. ఊరూర రంగురంగుల పూలను ఒద్దికగా పేర్చిన మహిళలు పాట లు పాడుతూ లయబద్దమైన తాళంవేస్తూ ఆనందంగా గడిపారు.

తీరొక్క పూలతో తీరుగా పేర్చిన బతుకమ్మలతో ఆడపడుచుల ఆటపాటలు, సంప్రదాయ నృత్యాలతో పట్టణాలు, గ్రామాలు హోరెత్తాయి. బతుకమ్మల ఆటలతో తెలంగాణలోని వీధులన్నీ పూల వనాలను తలపించాయి. ఈ క్రమంలో రాజ్‌భవన్‌లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో గవర్నర్ తమిళిసై, ఆమె కుటుంబసభ్యులు పాల్గొన్నారు. సిద్దిపేటలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. బతుకమ్మ పండుగ తొలిరోజున మహిళలకు ప్రభుత్వం తరఫున బతుకమ్మసారెను అందజేశారు. పట్టణంలోని పలు వార్డులకు చెందిన వందల సంఖ్యలో మహిళలకు మంత్రి హరీశ్ రావు బతుకమ్మ చీరలను అందజేశారు. బతుకమ్మ పండుగను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతుందన్నారు.

ఇందుకోసం నేతన్నల చేత ప్రత్యేకంగా చీరలను నేయించి మహిళలకు అందజేస్తుందని చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి బాలుర జూనియర్ కళాశాలలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. బతుకమ్మ పండుగను మహిళలందరూ ఘనంగా జరుపుకోవాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభిలాషించారు. పెద్దపల్లిలో జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో పర్యటించిన మంత్రి ఈశ్వర్ మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. ఉమ్మడి వరంగల్‌లో జిల్లాల్లోని ఊరువాడా బతుకమ్మ సంబురాలతో మురిసిపోయింది. హనుమకొండలోని వేయి స్తంభాల ఆలయం తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో పూలవనంలా మారింది.

వేలాదిగా తరలివచ్చిన మహిళలతో సందడిగా మారింది. బతుకమ్మ పాటలకు అనుగుణంగా మహిళలు నృత్యాలు చేస్తూ హొరెత్తించారు. అలాగే మెదక్ జిల్లాలోనూ బతుకమ్మలను అందంగా పేర్చి కోదండ రామాలయం బాలాజీ మందిరంతో పాటు వివిధ కూడళ్లు, కాలనీల వద్ద బతుకమ్మ ఆడారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ బతుకమ్మ ఆటపాటలు మారుమోగాయి. చిన్నాపెద్ద అంతా ఒక్కచోట చేరి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మహిళలు ఘనంగా జరుపుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బతుకమ్మ సంబురాలతో మురిసిపోయింది. హుజూరాబాద్‌లో ఎంగిల పూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.

సిరిసిల్ల మహిళలు సంతోషంగా బతుకమ్మ ఆడారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లోనూ ఊరువాడా ఉయ్యాల పాటలు మారుమోగాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బతుకమ్మ సంబురాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలోనూ తొలిరోజు బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా బతుకమ్మ సంబరాల్లో ఆడి పాడారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజు ఆదివారం ఎంగిలి బతుకమ్మ వేడుకల్లో ఎంఎల్‌ఎలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News