Monday, December 23, 2024

21న జాగృతి ఆధ్వర్యంలో యుకెలో బతుకమ్మ సంబరాలు

- Advertisement -
- Advertisement -
పోస్టర్‌ను ఆవిష్కరించిన కల్వకుంట్ల కవిత

మనతెలంగాణ/హైదరాబాద్ : భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన యుకెలో జరగబోయే బతుకమ్మ వేడుకల పోస్టర్‌ను మంగళవారం జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్‌ఎసి కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. గత అనేక సంవత్సరాలుగా భారత్ జాగృతి ఆధ్వర్యంలో వివిధ దేశాల్లో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రతి ఏటా భారత్ జాగృతి యుకె విభాగం ఆ దేశంలో మెగా బతుకమ్మ పేరిట వేడుకలు నిర్వహిస్తోంది. ఈనెల 21న నిర్వహించబోయే వేడుకలకు పెద్ద ఎత్తున తెలంగాణ వారితోపాటు, ప్రవాసి భారతీయులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ… బతుకమ్మకు అంతర్జాతీయంగా గుర్తింపు తేవడంలో విదేశాల్లో ఉంటున్న భారత్ జాగృతి కార్యకర్తలు విశేషంగా కృషి చేశారని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు పండగలకు వివిధ దేశాల్లో ప్రాచుర్యం కలగడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. బతుకమ్మ వేడుకలకు హాజరయ్యే మహిళలకు ఉచితంగా చేనేత చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించిన భారత జాగృతి యుకె విభాగాన్ని కల్వకుంట్ల కవిత అభినందించారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జాగృతి యుకె అధ్యక్షులు బల్మురి సుమన్, టిఎస్ ఫుడ్స్ చైర్మన్, భారత్ జాగృతి వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ సాగర్, భారత్ జాగృతి జనరల్ సెక్రెటరీ నవీన్ ఆచారి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Kavitha 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News