Monday, November 25, 2024

ఆడ బిడ్డల ఆత్మగౌరవం కోసమే బతుకమ్మ చీరలు పంపిణీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూరు: తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసమే రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తుందని ఎంపిపి రచ్చ కల్పనలక్ష్మీ నర్సింహారెడ్డి అన్నారు. మోత్కూరు మండలం దాచారం, పాటిమట్ల గ్రామాల్లో ఆదివారం మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రచ్చ లక్ష్మీ మాట్లాడారు. మహిళలు సంతోషంగా బతుకమ్మ పండుగను జరుపుకోవడానికి కెసిఆర్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని, అందులో భాగంగానే బతుకమ్మ చీరెలు పంపిణీ చేస్తుందన్నారు. మండలంలోని పాలడుగు గ్రామంలో సర్పంచ్ మరిపెల్లి యాదయ్య, ఎంపిటిసి ఆకవరం లక్ష్మణాచారి మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో దాచారం సర్పంచ్ అండెం రజిత రాజిరెడ్డి, పాటిమట్ల సర్పంచ్ దండెబోయిన మల్లేష్, పాలడుగు ఉపసర్పంచ్ ఎడ్ల భగవంతు, రైతుబంధు గ్రామ కోఆర్డినేటర్ సింగిరెడ్డి నర్సింహారెడ్డి, ఎస్‌ఎంసి చైర్మన్ ఎం.మల్లేష్, కె.అంజయ్య, బి.వీరయ్య, ఎం.మత్సగిరి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News