Wednesday, January 22, 2025

ప్రకృతిని పూజించే సంస్కృతి మనది : శ్రీనివాస్‌గౌడ్

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రపంచంలో ప్రకృతిని, పూలను పూజించే సంస్కృతి తెలంగాణలోనే ప్రత్యేకమని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలలో భాగంగా నిర్వహిస్తున్న దేవి వైభవ నృత్యోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ నర్తకిమణులు డాక్టర్ ఆనంద్‌శంకర్ జయంత్, మంగళభట్, ప్రొఫెసర్ ఆలేఖ్య పుంజాలలను మంత్రి సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహించుకుంటున్నామన్నారు. బతుకమ్మ సంబరాలను తెలంగాణ ఉద్యమంలో ఎంఎల్‌సి కవిత దేశ విదేశాల్లో ఘనంగా నిర్వహించి విశ్వవ్యాప్తం చేశారన్నారు. బతుకమ్మ పండుగను మహిళలు, ఉద్యోగినులు ఘనంగా నిర్వహించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కెవి రమణచారి, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్‌పర్సన్ మంత్రి శ్రీదేవి, సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ దీపికారెడ్డి, సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News