Monday, December 23, 2024

అంబరాన్నంటేలా పూల సంబురం

- Advertisement -
- Advertisement -

 

Bathukamma Festivals till 3rd October

రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు : సిఎస్

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఈ నెల 25వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ అన్నారు. బతుకమ్మ ఉత్సవాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు సోమవారం బిఆర్‌కెఆర్ భవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. డిజిపి మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి రమణాచారి, సమాచార శాఖ కమిషనర్ అరవింద్‌కుమార్‌తో పాటు సీనియర్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎస్ సోమేష్‌కుమార్ మాట్లాడుతూ ఈ నెల 25 వ తేదీ నుంచి ప్రారంభం కానున్న బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్ర రాజధానితో పాటు అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ ఉత్సవాలను అక్టోబర్ 3వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సద్దుల బతుకమ్మ జరిగే అక్టోబర్ 3వ తేదీన ట్యాంకుబండ్ వద్ద విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను సిఎస్ ఆదేశించారు. బతుకమ్మ ఘాట్, ట్యాంక్‌బండ్, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్డు మరమ్మతుల పనులు వెంటనే చేపట్టాలన్నారు.

ఈ సారి మహిళలు ఉత్సవాలలో భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించాలని అన్నారు. బతుకమ్మలను నిమ్మజ్జనం చేసే ప్రాంతాల్లో ఏ విధమైన ప్రమాదాలు జరుగకుండా ఈతగాళ్లను నియమించాలని ఆదేశించారు. బతుకమ్మ పండగ పై ఆకర్షణీయమైన డిజైన్‌లతో మెట్రో ఫిల్లర్లపై అలంకరించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారులు రమణాచారి మాట్లాడుతూ బతుకమ్మ ఉత్సవాలు మన రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైనవని అన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ ఉత్సవాలు నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు.

ఎల్ బి స్టేడియం, నగరంలోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మ లోగోలను ఏర్పాటు చేయాలని అన్నారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రాణికుముదిని, సునీల్ శర్మ, రామకృష్ణారావు, అరవింద్ కుమార్, జలమండలి ఎండి దానకిషోర్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవి గుప్తా, సందీప్‌కుమార్ సుల్తానియా, జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్‌కుమార్, నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఉన్నతాధికారులు రిజ్వీ, కిషన్‌రావు, సత్యనారాయణ,అనిల్‌కుమార్, డి.దివ్య, దేవసేన, కలెక్టర్ అమయ్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News