Monday, December 23, 2024

ప్రకృతి దేవత… బతుకమ్మ: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

అడపడుచుల ఔన్నత్యానికి , సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక..

జిల్లా ప్రజలకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు: మంత్రి హరీష్ రావు

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా ప్రజలకు మంత్రి హరీష్ రావు గారు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల‌కు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక అయిన‌ బతుకమ్మ పండుగను జిల్లా ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. ఎంగిలి పూలను వెదజల్లుకొనే అమావాస్య నుంచి తొమ్మిది రోజులపాటు అడబిడ్డ‌లు అంద‌రూ క‌లిసి తీరొక్క పూలు.. తీరొక్క రంగులతో బతుకమ్మ అడుకోని రేపు జరుపుకునే పెద్ద బతుకమ్మ గొప్పగా చేసుకుంటామని చెప్పారు. దేశంలో పూలతో చేసుకొనే ప్రకృతి దేవతగా పూజించే ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని ప్రశంసించారు. ఇలాంటి సంస్కృతి మన తెలంగాణలో ఉందని టిఆర్ఎస్ ప్రభుత్వం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నామ‌ని, రాష్ట్ర పండుగగా గుర్తించామ‌ని హరీష్ రావు చెప్పారు. ప్రతి ఏటా బతుకమ్మ కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ పండుగను ప్రజలందరు వేడుకగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News