Wednesday, January 22, 2025

బతుకమ్మ అంటే తెలంగాణ సంస్కృతీ

- Advertisement -
- Advertisement -

బతుకమ్మ అంటే చెరువులతో ముడిపడి ఉన్న బంధం
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
మనతెలంగాణ/హైదరాబాద్: బతుకమ్మ అంటే తెలంగాణ సంస్కృతీ అని, బతుకమ్మ అంటే చెరువులతో ముడిపడి ఉన్న బంధమని, మనం ఎంత ఎత్తుకు ఎదిగినా పూర్వీకులు ఇచ్చిన సంప్రదాయాన్ని భవిషత్ తరాలకు అందించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం సచివాలయంలో డా.అంబేద్కర్ సచివాలయం మహిళా ఉద్యోగుల ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ సంబురాల్లో మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పువ్వులను, చెరువులను పూజించే పండుగ అని, పూర్వం చెరువులపై మన జీవితాలు ఆధారపడి ఉండేవని, బతుకమ్మల్లో గౌరమ్మ వల్ల చెరువులు శుద్ధి అయ్యేవని, బతుకమ్మను కాపాడుకుందాం, మరిన్ని యుగాలు ఉండేలా భవిష్యత్‌కు అందిద్దామని మంత్రి సూచించారు. తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ ప్రేమ్, డా.అంబేద్కర్ సచివాలయ మహిళా ఉద్యోగుల అధ్యక్షురాలు పద్మావతి, జనరల్ సెక్రటరీ గీత, లావణ్యతో పాటు తెలంగాణ సచివాలయ ఉద్యోగులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News