Friday, December 20, 2024

తీరొక్క రంగుల్లో..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: 25 రంగులు, 25 డిజైన్లు, 625 కలర్ కాంబినేషన్‌లతో బతుకమ్మ చీ రల పంపిణీ షురూ అయ్యింది. మొదటిరోజు సు మారు 5 లక్షల చీరలను ప్రభుత్వం పంపిణీ చేసిం ది. రూ. 349 కోట్ల వ్యయంతో కోటి రెండు లక్షల చీరలను నేయించిన ప్రభుత్వం 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు వాటిని పంపిణీ చేస్తోంది.16వేల మరమగ్గాలు, 20వేల మంది కార్మికులను ఈ చీ రల తయారీకి శ్రమించారు. రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఏటా అందించే బతుకమ్మ పండుగ కానుక చీరల రంగులను, డిజైన్‌ల ను తెలంగాణ పవర్‌లూమ్ టెక్స్‌టైల్స్ డెవలప్‌మెం ట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టిపిటిడిసిఎల్) ఖరారు చేసింది. ఈసారి ప్రత్యేకంగా వెండి, బంగారు, జరీ అంచులతో ఈ చీరలను నేశారు. నేత కార్మికులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో 2017 నుంచి బతుక మ్మ పండుగకు చీరలను ప్రభుత్వం సారెగా అందిస్తోంది. గతంలో రాష్ట్ర చేనేత సహకార సంస్థ (టె క్సో) ద్వారా ఈ చీరల ఆర్డర్లు ఇవ్వగా ఈసారి తెలంగాణ పవర్‌లూమ్, టెక్స్‌టైల్స్ డెవలప్‌ంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టిపిటిడిసిఎల్) ద్వారా ఆర్డ ర్లు ఇచ్చారు.

6.22 కోట్ల మీటర్ల బట్టతో తయారీ
సిరిసిల్లలోని 139 మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ (మ్యాక్స్)లకు 3.70 కోట్ల మీటర్ల బ ట్టను (64.03 లక్షల చీరలు), 126 చిన్న తరహా పరిశ్రమల (ఎస్‌ఎస్‌ఐ)కు 1.84 కోట్ల మీటర్ల బట్ట ను (31.87 లక్షల చీరలు) ఆర్డర్లు ఇచ్చారు. జాకె ట్ పీసుల కోసం మరో 68 లక్షల మీటర్ల బట్టను సిరిసిల్ల శివారు టెక్స్‌టైల్స్ పార్క్‌లోని ఆధునిక మగ్గాలకు ఇచ్చారు. మొత్తంగా 6.22 కోట్ల మీటర్ల బట్టను బతుకమ్మ చీరల ఉత్పత్తి లక్ష్యంగా ఈ ఏడాది నిర్ణయించారు. చీరలకు ఉత్పత్తి రవాణా, ప్రాసెసింగ్ ఇతర ఖర్చులకు మొత్తం రూ.349 కోట్లను కేటాయించారు. సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్, గర్షకుర్తి, జమ్మికుంట, జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల, ధర్మపురిలోని చేనేత కార్మికులకు చీరెలను నేసి ప్రభుత్వానికి అప్పగించగా ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వాటిని సరఫరా చేశారు. ఇందులో 98 శాతం చీరెలను ఒక్క సిరిసిల్లలోనే తయారు చేశారు. 139 మ్యాక్స్ సంఘాలు, 126 ఎస్‌ఎస్‌ఐ (స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్) ఇందులో భాగస్వామ్యం కావడం గమనార్హం.

చీరలకు వెండి, బంగారు, జరీ అంచులతో….
దశాబ్దాలుగా ఉపాధి లేని నేతన్నలకు చేతినిండా పని కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరెల పంపిణీని చేపట్టింది. ఈ ఏడాది లబ్ధిదారుల సంఖ్య పెరగడంతో 1.02 కోట్ల చీరలను ఆర్డర్ చేసింది. సిద్ధమైన చీరలను హైదరాబాద్‌లోని 10, సిరిసిల్లలోని 2 ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా అధికారులు జిల్లా కేంద్రాలకు తరలించడంతో పాటు పంపిణీకి అన్ని చర్యలు చేపట్టారు. నిఫ్ట్ డిజైనర్లతో సరైన డిజైన్ పాటర్న్, ప్రామాణికాలతో మెప్మా, సెర్ప్ కింద స్వయం సహాయక బృందాల మహిళా ప్రతినిధుల అభిప్రాయాలు, సలహాల ఆధారంగా చీరలను డాబీ, జాకార్డు డిజైన్లతో పాటు కొత్తగా వెండి, బంగారు, జరీ అంచులతో నాణ్యమైన క్వాలిటీతో తయారు చేయించారు. టెస్కో ఆధ్వర్యంలో బిసి వెల్ఫేర్ శాఖ, రెవెన్యూ అధికారులు వీటిని పర్యవేక్షించారు. చీరెలన్నీ జరీ అంచులతో 100 శాతం పాలిస్టర్ ఫిలిమెంట్, నూలుతో నేశారు. నాణ్యత, తయారీ, ప్రింటింగ్, కొంగు, బార్డర్లు, ప్యాకేజింగ్ వంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
ఉత్తర తెలంగాణలోని వయోవృద్ధ మహిళల కోసం
6.30 మీటర్ల పొడవు గల 94 లక్షల సాధారణ చీరలకు అదనంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వయోవృద్ధ మహిళల కోసం ప్రత్యేకంగా 9 మీటర్లు పొడవు గల 8 లక్షల చీరలను తయారు చేయించారు. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో 94 లక్షల చీరలను పంపిణీ చేయనున్నారు. 2017సంవత్సరంలో 95,48,439 మహిళలకు, 2018లో 96,70,474 మందికి, 2019లో 96,57,813 మందికి, 2020లో 96,24,384, 2021లో 95,86,000, 2022లో 96,42,554 లక్షల చీరలను పంపిణీ చేయగా, ఈ ఏడాది 1.20 కోట్ల చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News