- Advertisement -
హైదరాబాద్: బతుకమ్మ చీరలు ఈసారి 17 రంగులు,17 డిజైన్లతో కలిపి మొత్తం 289 వర్ణాల్లో రూపొందించారు. వచ్చే నెల 6 నుంచి జరగనున్న బతుకమ్మ పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 2 నుంచే చీరలు పంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే దాదాపుగా అన్ని జిల్లాలకు చీరలు చేరుకున్నాయి. ఉప ఎన్నికల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో పంపిణీ పై సందిగ్థత నెలకొంది. ప్రభుత్వం ప్రతి ఏటా రూ.300 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
- Advertisement -