Sunday, December 22, 2024

బతుకమ్మ చీరల కాంట్రాక్టును మీ బినామీలకు ఇవ్వలేదా?: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో మీ అనుభవాలు మీకు ఉన్నాయని, కానీ ప్రజలకు అనుభవాలు రావడంతో కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని సిఎం రేవంత్ రెడ్డి చురకలంటించారు. సభ తప్పుదోవపట్టించడంతో కెటిఆర్‌కు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ద్రవ్య వినిమయ బిల్లుపై శాసన సభలో చర్చ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. సూచన అనే ముసుగులో మోసం అనే ప్రణాళికను ప్రజల మెదళ్లలో కెటిఆర్ చొప్పిస్తున్నారని, పది నెలలు పూర్తి కాని కాంగ్రెస్ పాలనపై కొన్ని వందల ఆరోపణలు చేయడం సరికాదన్నారు. పదేళ్లలో బిఆర్ఎస్ నాయకులు ఏ పాలసీ తీసుకొచ్చారో చెప్పాలని నిలదీశారు.

బతుకమ్మ చీరల కాంట్రాక్టును మీ బినామీలకు ఇచ్చి సూరత్ నుంచి తీసుకవచ్చారా? లేదా అనేది చెప్పాలని, బతుకమ్మ చీరల విషయంలో ఆడబిడ్డల తిరుగుబాటు చేశారా? లేదా? అనేది చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. సూరత్ నుంచి చీరలను తీసుకొచ్చి పేదలను మోసం చేశారని, సిరిసిల్ల నేతలతో ఎందుకు బతుకమ్మ చీరలు తయారు చేయించలేదని అడిగారు. వంద కోట్ల బతుకమ్మ చీరల బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించదన్నారు. క్రీడలలో క్రీడాకారులకు నైపుణ్యం కలిపిస్తామని, శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎంఎంటిఎస్‌ను నిర్మిస్తామని కేంద్ర ప్రభుత్వం అంటే కెసిఆర్ ప్రభుత్వం ఎందుకు తిరస్కరించిందని ప్రశ్నించారు. పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తామని తాము చెప్పలేదని, ట్యాంక్‌బండ్‌లోని నీటిని కొబ్బరి నీళ్లు చేస్తామని తాను ఎప్పుడూ చెప్పలేదని చురకలంటించారు. రేపు సాయంత్రం నాలుగు గంటలకు స్కిల్ వర్సిటీని ప్రారంభిస్తామని, స్కిల్ వర్సిటీ ప్రారంభోత్సవంలో ప్రతిపక్ష పార్టీ నుంచి వచ్చి పాల్గొనాలని రేవంత్ కోరారు. మహ్మద్ సిరాజ్, నిఖత్ జరీతకు గ్రూప్-1 జాబ్ ఇస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News