Thursday, January 23, 2025

ఆడపడచులకు బతుకమ్మ చీరలు

- Advertisement -
- Advertisement -

ఈనెల 14న సద్దుల బతుకమ్మ ప్రారంభం
ఇప్పటికే జిల్లా గోదాములకు చీరలు సరఫరా
10 రంగులు, 25 డిజైన్లు, 240 వెరైటీలు..
ఈసారి మరింత అందంగా బతుకమ్మ చీరలు
పంపిణీ చేసేందుకు స్థానిక అధికారుల ఏర్పాట్లు

మన తెలంగాణ/ హైదరాబాద్:  తెలంగాణ ఆడపడుచు మనసు మెచ్చేలా 10 రంగులు, 25 డిజైన్లు, 240 వెరైటీల్లో బతుకమ్మ చీరలు కొత్త రంగుల మెరుగులు, జరి అంచులతో నేతన్నల చేతిలో సరికొత్తగా రూపుదిద్దుకున్నాయి. ఈనెల 14 నుంచి బతుకమ్మ సంబురాలు ప్రారంభమైతుండగా చీరలను ఆడపడుచులకు అందించేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తోంది.

ఇప్పటికే పౌరసరఫరా శాఖ అధికారులకు అర్హుల జాబితా సిద్ధం చేయాలని సూచనలు చేయడంతో,  గ్రామాలకు చెందిన రేషన్ డీలర్లు పంపించారు. ప్రభుత్వం నుంచి చీరలు దిగుమతి అయితే పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేశారు. మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా ఉన్నతాధికారులతో టెలికాన్పరెన్స్ నిర్వహించి లబ్దిదారులకు బతుకమ్మ చీరలు అందించాలని సూచించారు. ఈ ఏడాది మంత్రి కెటిఆర్ రూ. 350 కోట్ల విలువైన కోటి చీరలు ఉత్పత్తికి ఆర్డర్ ఇవ్వగా ఇప్పటికే చీరలు ఉత్పత్తి దాదాపు పూర్తి చేసి ఆనెల 1వ తేదీ నుండి చేనేత జౌళి జిల్లా గోదాములకు తరలిస్తుందని టెక్స్‌టైల్ చైర్మన్ గూడూరు ప్రవీణ్ వెల్లడించారు.

గత జనవరిలో బతుకమ్మ చీరల ఆర్డర్‌ను రాష్ట్ర సర్కార్ ఇచ్చింది. కోటి చీరలకు సంబంధించి 6.3 కోట్ల మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేయాల్సి ఉండగా ఆర్డర్ వచ్చిన నాటి నుంచే ఉత్పత్తి ప్రారంభమైంది. సెప్టెంబర్ 15 వరకు మొత్తం తయారు పూర్తి కావాల్సి ఉండగా దాదాపుగా పదివేల సంచెలపై ఉత్పత్తిని ప్రారంభించారు. ఇప్పటివరకు 4.7 కోట్ల మీటర్ల వస్త్రం, 90 లక్షల పైగా చీరలు తయారు చేశామని చెప్తున్న నేతన్నలు పండుగ సమీపిస్తున్నందున చీరల ప్రొడక్షన్‌లో మరింత వేగం పెంచినట్టు చెప్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 15 వేల మంది కార్మికులు రాత్రి పగలనకుండా పనిచేస్తున్నారని రోజుకు సుమారుగా మూడున్నర లక్షల మీటర్ల వస్త్రం (60 వేల పైగా చీరలు) ఉత్పత్తి చేస్తున్నారు. బతుకమ్మ చీరల తయారీలో నేత కార్మికులతో ఇతర రంగాలకు చెందిన ఆటో కార్మికులు, గుమస్తాలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా భాగస్వాములు శ్రమిస్తున్నారు. ప్రతినెల 16 వేల నుంచి 20 వేల వేతనం అందుతుండడంతో నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్లుగా బతుకమ్మ చీరలు తయారీలో చేతీ నిండా పని కల్పించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు నేత కార్మికులు కృతజ్ఞతలు చెప్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News