Wednesday, January 22, 2025

ప్రైవేట్ పాఠశాల బస్సులో పేలిన బ్యాటరీ

- Advertisement -
- Advertisement -

జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం ప్రైవేట్ స్కూల్ బస్సు 30 మంది విద్యార్థులతో వస్తుండగా బస్సులోని బ్యాటరీ పేలింది. దీంతో దట్టంగా పొగలు వ్యాపించాయి. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతూ రోదించారు. డ్రైవర్ అప్రమత్తతతో బస్సును ఆపి, విద్యార్థులను కిందికి దించేందుకు స్థానికులు చేయి కలిపారు. దీంతో విద్యార్థులు రోదిస్తూ బస్సు నుంచి బయటకు పరుగులు పెట్టారు.

బస్సులో పొగలు రాకుండా అగ్ని ప్రమాదం జరిగి ఉంటే భారీ నష్టం వాటిల్లి ఉండేదని స్థానికులు వ్యాఖ్యానించారు. స్కూల్ బస్సులో బ్యాటరీ పేలడంపై విద్యార్థుల తల్లితండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు కండిషన్ చూసుకోకుండా నడిపిస్తే ఇలాంటి ప్రమాదాలే సంభవిస్తాయని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పాఠశాల యాజమాన్యంతో పాటు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News