Monday, December 23, 2024

బ్యాటరీ ఫ్యాక్టరీలో పడిన దొంగలు… వాచ్ మెన్లను బెదిరించి రూ.50 లక్షలు ఎత్తుకెళ్లారు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కాటేదాన్ లో దొంగలు హల్ చల్ చేశారు. బ్యాటరీ ఫ్యాక్టరీలో చొరబడి అల్మారాలో ఉన్న 50 లక్షలను దొంగలు ఎత్తుకెళ్లారు.  వాచ్ మెన్ ను కత్తితో బెదిరించి బీరువాలో ఉన్న డబ్బును దొంగలించారు. వాచ్ మెన్ సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనం చేసింది తెలిసిన వారేనని పోలీసులు అనుమానిస్తున్నారు. కత్తులతో బెదిరించి దొంగతనం చేశారని వాచ్ మెన్ చెబుతున్నారు. నిద్రపోతున్న ఇద్దరిని బెదిరించి చోరీ చేశారని పోలీసులకు తెలిపారు. డాగ్ స్క్వాడ్ టీమ్ రంగంలోకి దిగింది. దొంగల కోసం ఐదు టీమ్స్ గాలింపు చర్యలు చేపట్టాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News