Wednesday, January 22, 2025

రొమ్ముక్యాన్సర్‌కు బ్యాటరీ చికిత్స

- Advertisement -
- Advertisement -

దేశం లోని క్యాన్సర్ కేసుల్లో 14.5 శాతం రొమ్ము క్యాన్సర్ కేసులు ఉంటున్నాయి. అలాగే క్యాన్సర్ మరణాల్లో 10.6 శాతం రొమ్ముక్యాన్సర్‌వే. దేశంలో రొమ్ముక్యాన్సర్ సర్వసాధరణ వ్యాధిగా మారింది. మొత్తం మీద దీని మనుగడ ఐదేళ్లు అనుకుంటే 95 శాతం మొదటి దశ రోగులు, 92 శాతం రెండోదశ రోగులు, 70 శాతం మూడోదశ రోగులు, కేవలం 21శాతం నాలుగోదశ రోగులు ఉన్నారు.

భారతీయ మహిళల్లో దీని తీవ్రత ఎలా ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది. పాశ్చాత్యదేశాలతో పోల్చిచూస్తే భారత్‌లో రొమ్ముక్యాన్సర్ తో జీవించేవారి శాతం చాలా తక్కువ. వ్యాధిని ఆలస్యంగా తెలుసుకోవడం, సరైన సమయంలో చికిత్స అందకపోవడం, తక్కువ వయస్సులోనే వ్యాధి ప్రారంభించడం తదితర కారణాల వల్లనే భారత్‌లో రొమ్ముక్యాన్సర్ మరణాలు తీవ్రంగా ఉంటున్నాయి. ఈ సమస్యలతోపాటు ఇది ప్రాణాంతకమైనదే కాకుండా మానసికంగా, భౌతికంగా మహిళలను వేధిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా లోని ఫుడాన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు రొమ్ముక్యాన్సర్ చికిత్సలో కొత్త విధానాన్ని రూపొందించారు.

శరీరం లోకి ఒక చిన్న బ్యాటరీని పంపించడం ఈ కొత్త ప్రక్రియలో విశేషం. క్యాన్సర్ కణతి కణాలు చుట్టూ ఉప్పునీటిని పంపిస్తారు. అందులో చిన్నపాటి విద్యుత్‌ను సృష్టించడం ద్వారా బ్యాటరీ పనిచేస్తుంది. ఈ బ్యాటరీ వల్ల క్యాన్సర్ చికిత్సకు అందించే ఔషధాలు సమర్ధంగా పనిచేసి కణతిని తొలగిస్తాయి. ఎలుకలపై ఈ ప్రయోగం మొదట చేశారు. కేవలం రెండు వారాల్లోనే ఆ ఎలుకల్లో క్యాన్సర్ కణతులు 90 శాతం వరకు నిర్మూలింప బడ్డాయని ,మనుషుల్లో కూడా ఇదే రకమైన ఫలితాలు వస్తాయని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. శరీరంలో చొప్పించే చిన్న బ్యాటరీ దాదాపు 500 గంటల పాటు పనిచేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News