Saturday, January 18, 2025

అది హక్కుల పరిధిలోకి రాదు

- Advertisement -
- Advertisement -

భూమిలేని నిరుపేద కూలీలకు ఆర్థిక సాయం ప్రకటనపై
డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వివరణ అది ఎన్నికల హామీ.. దీనిపై
ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వడమేంటని ప్రశ్న నడి సముద్రంలో చిక్కుకున్న నావలా మారిన బిఆర్‌ఎస్ పరిస్థితి చిట్‌చాట్‌లో డిప్యూటీ సిఎం

మన తెలంగాణ/హైదరాబాద్:భూమిలేని పేద రైతులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయంగా అందిస్తామన్నది ఎన్నికల హామీ. దీనిపై తనకు ప్రివిలేజ్‌మోషన్ నోటీసు ఇవ్వడం ఏమిటనీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమా ర్క ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఒక సమావేశంలో ఒక రైతు తన వద్దకు వచ్చి రైతులకు రుణమాఫీ చేస్తున్నారు. రైతు భరోసా ఇస్తామంటున్నారు. మరి భూమిలేని మా పరిస్థితి ఏమిటని అడిగితే, భూమిలేని పేదలకు కూడా తమ ఫ్రభుత్వం ఆర్థిక తోడ్పాటు అందించబోతుందని చెప్పడం జరిగిందన్నారు. అది తమ ఎన్నికల హామీ కూడా అని భట్టి వివరించారు. ఎన్నికల హామీ గురించి చెబితే ప్రివిలేజ్ మోషన్ కిందకు ఎలా వస్తుందని భట్టి ప్రశ్నించారు. అం టే దీని అర్థం భూమిలేని పేదలకు ప్రభుత్వం సహాయం చేయవద్దానా? అని భట్టి ప్రశ్నించా రు.

శాసనసభ బుధవారానికి వాయిదా పడిన అనంతరం డిప్యూటీ సీఎం భట్టి తనను కలిసిన మీడియా ప్రతినిధులతో
చిట్‌చాట్ చేశారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ పార్టీ పరిస్థితి నడి సముద్రంలో తుఫాన్‌లో చిక్కుకున్న నావలా తయారై గమ్యం తెలియడం లేదని భట్టి వ్యాఖ్యానించారు. అసలే సముద్రం పైగా తుఫాన్‌కు సుడిగాలి తోడు కావడంతో గమ్యం తెలియడం లేదని అన్నారు. అసలాయనేమో (కేసీఆర్) ఫామ్ హౌస్‌కే పరిమితం కావడంతో వారికి గమ్యం తెలియక సముద్రంలో చిక్కుకున్న నావలో ఎటు కొట్టుకుపోతున్నారో తెలియడం లేదని అన్నారు. సభ అర్ధంతవంతంగా జరగాలని ఒకవైపు అంటూనే, మరోవైపు సభలో ప్రభుత్వం చెప్పేది వినకుండా గందరగోళం సృష్టిస్తున్నారని భట్టి విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News