ముంబై : కరేబియన్ గడ్డపై విండీస్‌తో 5 టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను 32తో చేజార్చుకుని ఇంటి బయట తీవ్ర విమరర్శలు ఎదుర్కొంటున్న టీమిండియాపై ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ సంచలన వాఖ్యలు చేశాడు. ‘బ్యాటింగ్ లైనప్ చాలా బలహీనంగా ఉందని, బ్యాటింగ్ ఆర్డర్‌పై కసరత్తు చేయాల్సిన అవసరం ఉందన్నాడు. ‘జట్టులో అక్షర్ పటేల్ ఏడో స్థానంలో, ఆ తర్వాత యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్ లాంటి టెయిలెండర్లు బ్యాటింగ్ చేస్తారు.
టెయిలెండర్లందరికి పెద్దగా బ్యాటింగ్ రాదు. మరోవైపు విండీస్ టెయిలెండర్లు సిక్స్‌లు కొట్టగలరు. మా జట్టులో అలా కాదు. టి20 ఫార్మాట్‌లో బ్యాటింగ్ ఆర్డర్ సమస్య ఉందని, లోతైన కసరత్తు అవసరం’ అని పేర్కొన్నాడు. ఇక మా బౌలింగ్ ఫర్వా లేదు’ అని తెలిపాడు. విండీస్ జట్టులో అల్జారీ జోసెఫ్ చివరి స్థానంలో వచ్చి కూడా భారీ షాట్లు ఆడతాడు. మనకు అలాంటి ఆటగాళ్లు అవసరం. తప్పకుండా బ్యాటింగ్ లైనప్‌పై వర్కౌట్ చేస్తాం’ అని రాహుల్ ద్రవిడ్ చెప్పాడు.