న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్‌లలో బిజెపి అద్భుతమైన విజయాలు నమోదు చేసిన తర్వాత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శుక్రవారం ‘ ఈ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చే లోక్‌సభ ఎన్నికలలో ఎటువంటి ప్రభావం చూపవు’ అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలు ‘భారత్ కోసం పోరాటం’ అని నొక్కి చెప్పారు. అది ఏ రాష్ట్ర ఎన్నికల ఫలితాల ద్వారా కాకుండా 2024 పోరాడడం ద్వారానే నిర్ణయించబడుతుంది అన్నారు. ‘బిజెపి 2019(లోక్‌సభ) గెలుపు గురించి రాజకీయ పండితులు పెద్దగా ఆలోచించలేదు. అది 2017 యూపి ఫలితాలతోనే నిర్ణీతం అయిపోయింది.
ఇప్పుడు 2022 యూపి ఫలితాలు 2024 లోక్‌సభ ఫలితాలను నిర్ణయిస్తాయని వారు చెప్పడానికి సాహించగలరు’ అని ప్రధాని నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేయడంపై ప్రశాంత్ కిశోర్ స్పందించారు. ‘ఆయన ఈ వివరణకు డంగైపోకండి. భారత్ కోసం పోరాటం అన్నది 2024లో జరుగుతుంది. నిర్ణీతం అవుతుంది. దానిని ఏ రాష్ట్ర ఫలితాలు నిర్ణయించజాలవు. ఆ పెద్ద మనిషికి కూడా ఇది తెలుసు. కానీ ఆయన ఇప్పటి రాష్ట్రాల విజయాలను ఆయన ఊదరగొట్టాలనుకుంటున్నారు. ప్రతిపక్షాలపై మానసిక విజయం సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన మాటట ఉచ్చులో పడిపోకండి. ఆయన చెప్పేదంత ఉత్తుతి వివరణలు’ అని కిశోర్ ట్వీట్ చేశారు.