Monday, December 23, 2024

ఐఐఐడి 2024 వద్ద ‘క్యూ ది కర్వ్’ కలెక్షన్‌ను ఆవిష్కరించిన బే విండో

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రత్యేకమైన డిజైన్ విధానం, తమదైన రీతిలో ప్రత్యేకంగా నిలిచే ఫర్నిచర్ కు ప్రసిద్ధి చెందిన బే విండో, ఐఐఐడి ఎక్స్ పో 2024లో తమ తాజా కలెక్షన్ ‘క్యూ ది కర్వ్’ని ఆవిష్కరించింది. ఇంటి యజమానుల కోసం సరికొత్త డిజైన్‌లు, మెటీరియల్‌ల ప్రదర్శనగా హామీ ఇస్తూ ఈ ఎక్స్ పో ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్స్ (ఐఐఐడి) నిర్వహించింది.

బే విండో యొక్క ‘క్యూ ది కర్వ్’ కలెక్షన్ ఫ్లూయిడ్ డిజైన్‌లు, సొగసైన ఆకృతులను ప్రదర్శిస్తుంది. ఈ కలెక్షన్ లోని ప్రతి పీస్ ఆధునిక ఇంటీరియర్స్ ను నిర్వచించే కార్యాచరణ, సొగసుల సమ్మేళనాన్ని అందిస్తూ, ఆకర్షణీయమైన జీవనాన్ని ప్రేరేపించడానికి సూక్ష్మ అంశాలకు సైతం ప్రాధాన్యత ఇస్తూ రూపొందించబడింది. భారతీయ జీవనశైలి కోసం రూపొందించిన వైవిధ్య భరితమైన అంతర్జాతీయ డిజైన్‌లను పరిచయం చేయడంలో బే విండో ప్రత్యేకత కలిగి ఉంది.

“ఇలాంటి ప్రతిష్టాత్మక వేదిక వద్ద మా ‘క్యూ ద కర్వ్’ కలెక్షన్ ను విడుదల చేయటం పట్ల మేము సంతోషిస్తున్నాము. ఆవిష్కరణ, నాణ్యత పట్ల నిబద్ధతను మా డిజైన్‌లు ప్రతిబింబిస్తాయి. సందర్శకులు మా ఫర్నిచర్‌ను స్పూర్తిదాయకంగా మరియు ఆచరణాత్మకంగా కనుగొంటారని మేము విశ్వసిస్తున్నాము” అని బే విండో సహ వ్యవస్థాపకుడు సిద్ధాంత్ ఆనంద్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News