ఒకప్పటి నటి మంజుల పెద్ద కుమార్తె వనితా విజయ్ కుమార్ గుర్తుంది కదా. ఈమెకు వివాదాలంటే బాగా ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో తలదూరుస్తూ, వార్తల్లో ఉంటుంది. తాజాగా ఆమెపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. ఆమె మొహానికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని వనిత స్వయంగా ట్విట్టర్ లో తెలిపింది.
‘నిన్న రాత్రి నా చెల్లెలి ఇంటినుంచి తిరిగి వస్తుంటే ఒక వ్యక్తి నాపై దాడి చేశాడు. నా మొహంపై గాయం చేసి పారిపోయాడు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగదనే ఉద్దేశంతో ఆ పని చేయలేదు. నేరుగా ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్లిపోయాను’ అని వనిత వివరించింది. బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్న ప్రదీప్ అనే కంటెస్టెంట్ స్నేహితుడే ఈ పని చేశాడని తనకు అనుమానంగా ఉందని ఆమె పేర్కొంది. వనిత కుమార్తె జోవిక బిగ్ బాస్ 7 లో పాల్గొంటున్నారు. దాంతో వనిత కూడా బిగ్ బాస్ హౌస్ మేట్స్ పై కామెంట్లు చేస్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు.