Wednesday, January 22, 2025

జాన్సన్ రుణోదంతం.. బిబిసి ఛైర్మన్ రిచర్డ్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

లండన్ : బిబిసి ఛైర్మన్ రిచర్డ్ షార్ప్ శుక్రవారం తమ పదవికి రాజీనామా చేశారు. బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు 800,000 పౌండ్లు ( పది మిలియన్ డాలర్ల) రుణం వచ్చేలా చేయడం, సంబంధిత విషయాలపై వార్తలు రాకుండా చేయడంలో తన పాత్ర ఉందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రిచర్డ్ పదవి నుంచి వైదొలిగారు. ఆయన అంతకు ముందు జాన్సన్‌కు రుణం ఇప్పించారు. అయితే బిబిసి పదవి దశలో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఇది ప్రభుత్వ వద్ద రహస్యాలను దాచిపెట్టడం, అధికారిక రహస్యాల చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని స్వతంత్ర సంస్థ దర్యాప్తులో తేలింది. ఆయన తన హోదాను దుర్వినియోగపర్చారని దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్న దశలో తాను ఈ పదవిలో ఉండటం కుదరదని పేర్కొంటూ రాజీనామాకు దిగారు. జాన్సన్‌కు రుణం అందేలా చేసినందుకే బిబిసి అత్యున్నత పదవిని కట్టబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి.

ఆయన గతంలో ఓ బ్యాంకర్, పార్టీలకు విరాళాలు అందించేవాడిగా పేరొందారు. ప్రజాధనంతో స్వతంత్రంగా వ్యవహరించాల్సిన బిబిసిని ఇంతకు ముందటి జాన్సన్ ప్రభుత్వం తరచూ తన చెప్పుచేతల్లో పెట్టుకునేందనే విమర్శలు ఉన్నాయి. పార్టీకి భారీ చందాలు ఇచ్చినందునే షార్ప్ బిబిసిలో ప్కరముఖ స్థానం పొందారనే విమర్శలు నేపథ్యంలో రాజీనామా పరిణామం చోటుచేసుకుంది. తాను ఉద్థేశపూరితంగా ఎటువంటి తప్పు చేయలేదని, అయితే దర్యాప్తు క్రమంలో ఈ పదవిలో ఉండటం నైతికం కాదని వైదొలుగుతున్నట్లు తెలిపారు. తన తప్పిదానికి తన నియామకానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. రుణాలిప్పించడాన్ని బిబిసిలో ఉన్నత పదవితో జతచేసి చెప్పడం భావ్యం కాదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News