Wednesday, December 25, 2024

బిబిసి డాక్యుమెంటరీ వివాదం: కేంద్రానికి సుప్రీం నోటీసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: 2002 గుజరాత్ అల్లర్లు, ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీని విమర్శిస్తూ బిబిసి రూపొందించిన డాక్యుమెంటరీ తీవ్ర వివదాదానికి దారితీయడం, దీంతో ఆ డాక్యుమెంటరీ ప్రసారంపై కేంద్రప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషనపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఆ డాక్యుమెంటరీ ప్రసారాన్ని నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఒరిజినల్ రికార్డులను సమర్పించాలంటూ కేంద్రప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

బిబిసి డాక్యుమెంటరీని చూసే పౌరులను ప్రభుత్వం అరెస్టులు చేస్తోందని, దీనిపై నిషేధం విధించడం భావప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధమేనని పేర్కొంటూ సీనియర్ జర్నలిస్టు ఎన్ రామ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రా, సామాజిక కార్యకర్త, న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మరో న్యాయవాది ఎంఎల్ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

వీటిపై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు కోర్టుతో పాటుగా ట్విట్టర్, గూగుల్ సహా మరికొందరికి నోటీసులు జారీ చేసింది. మూడువారాల్లోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ సమయానికల్లా ఆ డాక్యుమెంటరీ నిషేధానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లనుకోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేసింది.

‘ఇండియా: ది మోడీ క్వశ్చన్’ పేరిట బిబిసి రూపొందించిన డాక్యుమెంటరీనియూ ట్యూబ్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలు నెటిజన్లకు అందుబాటులో ఉంచాయి. ఇది కాస్త వివాదాస్పదమైందని భావించిన కేంద్రప్రభుత్వం ఆ లింకులను తొలగించాల్సిందిగా గత నెల 21న ఆ సామాజిక మాధ్యమాలను ఆదేశించింది.ఆ డాక్యుమెంటరీపై మన దేశంలో భారతీయ జనతా పార్టీ వర్గాలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News