Wednesday, November 6, 2024

బిబిసి, అదానీ, పఠాన్

- Advertisement -
- Advertisement -

మోడీపైన వచ్చిన బిబిసి డాక్యుమెంటు చుట్టూ చేరిన వివాదాలు, షారుక్ ఖాన్ సినిమా ‘పఠాన్’ విజయవంతంగా నడవడం, గౌతవ్‌ు ఆదానీపైన హిండెన్ బర్గ్ నివేదిక వంటి సంఘటనల సంచలనాలు పాలక హిందుత్వ వాదులకు ఇటీవల చాలా ఇబ్బందికరంగా తయారయ్యా యి. భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఒక దేశ నిరంకుశుడిని ఆహ్వానించడాన్ని కాసేపు పక్కన పెడదాం. అయినా ఇటీవల కొన్ని వారాలుగా భారతీయ జనతా పార్టీకి కానీ, దాని భక్తాగ్రేసరులకు కానీ పరిస్థితులు సంతోషకరంగా లేవు. వర్గీకరించిన డాక్యుమెంట్లను పరిశీలించి తిరస్కరించడానికి, ఆర్థిక విషయాల్లో బహిర్గతమైన కుట్రలను, ఒక జాతి రాజ్యాంగాన్ని కన్నీళ్ళలో ముంచేసిన నియంతను మరొక దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చిన శుభకార్యానికి ఆహ్వానించడంలో కానీ, ప్రధాన మంత్రికి సలహాలివ్వడంలో విదేశీ వ్యవహారాల శాఖ తెలివిగా వ్యవహరిస్తుందని ఎవరైనా ఊహిస్తారు.ఈ నిర్వాకమంతా మన నూతన యుద్ధ దౌత్యం చేసిందేనని ఎవరైనా ఊహించగలుగుతారు.

బిబిసి డాక్యుమెంట్ల వివాదం

‘ద మోడీ క్వశ్చన్’ అనే రెండు భాగాలుగా దిగుమతి అయిన బిబిసి డాక్యుమెంటరీని అధికారికంగా చంపేసిన విషయం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ డాక్యుమెంటరీని పరిశీలించాలనే విషయం అసలు పట్టించుకోకుండా, దాని గొంతును కాషాయ కండువాతో మెలిపెట్టేశారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి పత్రికల వారితో మాట్లాడుతూ, భారతదేశానికి వ్యతిరేకంగా జరిగిన ‘కుట్ర’ అని, ఇది ‘వలస వాద మనస్థత్వం’ అని ముద్ర వేసేశారు. దీన్ని ‘సంక్లిష్టమైన సోమరితనపు ప్రతిచర్యగా వచ్చిన స్పందన’ అని నేనంటాను. నా ఉత్తమ పాఠకుల కోసం ఈ మోతాదు ఒక విస్తృతమైన యాంటీ బయాటిక్ లాంటిది. మనకు వచ్చిన అంటువ్యాధి ఏ రకంమైందో కచ్చితంగా గమనించలేనప్పుడు, వచ్చిన అంటు వ్యాధిని కూడా తగ్గిస్తుందని డాక్టర్ ఒక విస్తృత ప్రయోజనం కలిగించే యాంటిబయాటిక్ రాసిస్తాడు.

అది ఒక బాంబుల గుత్తి లాంటిది. తరువాత అది విదేశీ వ్యవహారాల శాఖకు ఒక ఆయుధంలా తయారవుతుంది. అది ఒక అదుపు లేని ఫిరంగిలా తయారవడానికి దారితీస్తుంది. కేంద్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి, కంగనా రనౌత్, అమిత్ మాలవ్యాల కంటే బిబిసి పరువు ట్విట్టర్ వేదికలో కాస్త పెరిగింది. బ్రిటిష్ పన్ను చెల్లింపుదారులు దీనికి నిధులు సమకూరుస్తుంటారు. బ్రిటిష్ ప్రభుత్వం ఒక వాహిక లాంటిది మాత్రమే పని చేస్తుందన్న విషయం మన వీరులు గమనించలేకపోతున్నారు. కొన్నేళ్ళ క్రితం 1940లో వచ్చిన బెంగాల్ కరువు గురించి ఇలాంటి డాక్యుమెంటరీనే బిబిసి విడుదల చేసింది. దీనికి చర్చిల్, ఆనాటి వలస ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొంది. కొవిడ్ సమయంలో అది ప్రధానిగా బోరిస్ జాన్సన్‌దే బాధ్యత అని మోపుతూ పూర్తి స్థాయి నివేదికను ఇచ్చింది. ఎవరైతే తమ మూలాలను అమ్మేసుకున్నారో, అలాంటి మన టివి యాంకర్లు, టిఆర్‌పి వీరులు బిబిసికి విశ్వసనీయత లేదని, రాజీ పడిపోయిందని చెప్పేస్తుంటారు.

ప్రధాన మంత్రికి మీడియా సలహాదారు స్వపన్ దాస్ గుప్త వేదకాలం నాటి జర్నలిస్టుగా నేను భావిస్తాను. ఈ డాక్యుమెంటరీలో ఆత్మన్యూనతా భావంలో ఉన్న బిజెపి తరపున అంతకంటే ఎక్కువగా చక్కగా స్క్రీన్‌లో కనిపించారు. ఈ డాక్యుమెంటరీని డిజిటల్ ప్లాట్ ఫాం పైన వెంటనే నిషేధించమని ప్రభుత్వానికి ఈయనే చెప్పి ఉండవచ్చు. దాన్ని విశ్వవిద్యాలయాల్లో కానీ, ప్రజలు కానీ చూడడాన్ని నిలుపుదల చేయాలని సూచించి ఉండవచ్చు. ‘పఠాన్’ సినిమా, దీపికా పడుకొనె లోదుస్తుల తరువాత ఈ డాక్యుమెంటరీ రెండవ ప్రాముఖ్యత గలదిగా తయారైంది. స్వపన్ దాస్ గుప్త కనుక ఇంతగా సమర్థించడానికి తన సమయమంతా కేటాయించకపోయినట్టయితే, స్టెరీశాండ్ ప్రభావం గురించి తెలుసుకునుండే వారు. అది కూడా 2003లో బార్బరా స్టెరీశాండ్ మాలిబు భవనం గురించి కాలిఫోర్నియా కోస్టల్ ప్రాజెక్టు నివేదిక వెల్లడించింది.

ఈ భవనం కనిపించడానికి తీర ప్రాంతం కోతకు గురికాకుండా ఉంటానికి విధానాలను రూపకల్పన చేయడానికి నిబంధనలు రూపొందించారు. కానీ ఆ నటి తన గోప్యతను దెబ్బతీశారంటూ 50 మిలియన్ల అమెరికా డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని కోర్టులో కేసు వేసింది. దాంతో ఆమెకు, ఆమె భవనానికి విపరీతమైన ప్రచారం లభించింది. అంతకు ముందు కేవలం ఆమెకు చెందిన ఆరు ఫొటోలు మాత్రమే డౌన్‌లోడ్ అయ్యేవి. ఆ తరువాత 42 వేల ఫొటోలు డౌన్‌లోడ్ అయ్యాయి. ఒక సమాచారాన్ని పాడు చేయాలని, దాచాలని ప్రయత్నిస్తే ప్రజల దృష్టి దానిపై మరింత ఎక్కువగా పడుతుంది. బిబిసి డాక్యుమెంటరీ విషయంలో కూడా ఇదే జరిగింది. బిజెపి భక్త వీరులకు మాత్రం ఇది ఇబ్బంది కలిగించింది.
పఠాన్ సినిమా ప్రభావం

ఈ దారిలోనే నడిచినందుకు పఠాన్ సినిమా దీనికి రెండింతలు నష్టపరిచింది. లోతుల్లోకెళ్ళలేను కానీ, కొంత కాలంగా షారుక్ ఖాన్ అంటే హిందూత్వ వాదులకు ఒక అయిష్టం ఏర్పడింది. దీని గురించి మనలో ఎవరూ అంతగా పట్టించుకోలేదు. ఇతను రాజకీయాలకు దూరంగా, ప్రజల్లో ఒక పెద్ద మనిషిలా గుర్తింపు పొందాడు. అతనంటే కోపానికి అది కూడా కారణమై ఉండవచ్చు. అతనెప్పుడూ శత్రువును గుర్తించలేదు. నేటి రాజకీయాలనూ ఆమోదించలేదు. అతను భారత దేశంలో పెద్ద సూపర్ స్టార్ కాబట్టి, అతని మతానికి చెందిన వారెవరూ ఆ స్థాయిలో విజయవంతం కాలేదు కనుక అతన్ని ఆ స్థాయి నుంచి దించేయాలి. రాజ్ కపూర్ నుంచి ఎఆర్ రహమాన్ వరకు భారత దేశానికి సంబంధించిన ముఖ్యంగా బాలీవుడ్ అనేది అంతర్జాతీయం గా గుర్తింపు పొందింది. పాటల్లో, నాట్యంలో, పాట రచనలో, దర్శకత్వంలో, నేపథ్య గాయకుల్లో, నటుల్లో ఆనందకరమైన ఆ ముఖాలు సాంస్కృతిక భిన్నత్వంగా, భిన్న మతాలుగా, భిన్న విశ్వాసాలుగా దర్శనమిస్తున్నాయి. భారత దేశం ఒకే మతంతో, ఒకే సంస్కృతితో గుర్తింపు పొందాలనుకునే వారికి, వారి అనుచరులకు ఇది ఆమోదయోగ్యంగా లేదు.

బాలీవుడ్ ముఖంగా షారుక్ ఖాన్‌కు గుర్తింపు లభించినప్పటి నుంచి అతన్ని కిందికి నెట్టేయాలనే ప్రయత్నం జరుగుతోంది. షారుక్ ఖాన్ కుమారుడిని ఉద్దేశపూర్వకంగా తప్పుడు డ్రగ్స్ కేసులో ఇరికించడం ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చింది. అయిదేళ్ళలో అతని పఠాన్ సినిమా విజయవంతం కాకూడదని వారు భావించారు. దాని గురించి వివాదాలు సృష్టించారు. పఠాన్‌కు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని రూపొందించేందుకు టివి చర్చలు మొదలు పెట్టారు. బెదిరింపులకు పాల్పడ్డారు. గతంలో బ్రహ్మాస్త్రాలు ప్రయోగించినప్పుడు ఎలా నిశ్చలంగా ఉందో, ఇప్పుడు కూడా అలాగే నిశ్చలంగా ఉండిపోయింది. ఒక టైటానిక్ సినిమా లాగా, అవతార్ సినిమాలాగా ప్రజాదరణను పొందే మార్గంలో షారుక్ ఖాన్ సినిమా అప్రతిహతంగా సాగుతోంది. రోగనిరోధక శక్తిని పెంచుకోవడం వల్ల కోవిడ్ బలహీనపడినట్టు, జాతీయవాదం అనే ఒక మత్తు కూడా బలహీనపడుతుందా? అనేది కాలమే నిర్ణయించాలి. ఈ రెండు అంశాలు మాత్రం మంచిని చెప్పే భవిష్యవాణిలా ఉన్నాయి.

హిండర్ బర్గ్ నివేదికతో బహిర్గతమైన అదానీ ఆర్థిక అవినీతి టివి యాంకర్ల విలువ కంటే వేగంగా పతనమైపోయింది. ఈ నివేదికను పూర్వపక్షం చేయడానికి యధావిధిగా ‘కుట్ర’, ‘భారత్ వ్యతిరేకం’ వంటి ఆయుధాలను వెలికి తీశారు. అదానీ సంస్థల చీఫ్ పైనాన్స్ ఆఫీసర్ మాట్లాడుతూ తనను తాను జాతీయ పతాకంలో చుట్టుకుని, తన షేర్ల మారణ హోమాన్ని జలియన్ వాలాబాగ్ మారణ హోమంతో పోల్చుకున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత సెక్యూరిటీ, ఎక్స్చేంచ్ బోర్డు, స్టాక్ ఎక్స్చేంజ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు అతీతంగా కీచులాడుకున్నట్టుగా కాకుండా, ఎగతాళి జరిగేలా మాట్లాడాడు. ఎవరు ముందర మిణుక్ మంటారన్నది ప్రశ్న కాదు. ఇప్పటికే అదానీ తన ఫాలో ఆఫ్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పిఒ) రద్దు చేసుకోవడం ద్వారా మిణుక్ మన్నాడు. తొలుత ఎవరు మాట్లాడతారు? బిబిసి విడుదల చేసిన డాక్యుమెంటరీలో చెప్పిన విషయాలు వాస్తవాలు కాకపోవచ్చు, కానీ ఇద్దరు వ్యక్తులు ఈ మహత్తరమైన భారత జాతికి సమానం కాదు. ఆ ఇద్దరు వ్యక్తుల అనైతిక మాయ కూడా సమానం కాదు. మన అమృత కాలానికి శుభప్రదం కాదు. ఊదరగొట్టే జి20 అధ్యక్షతా కాదు కదా?

రాఘవశర్మ
9493226180

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News